Monday, April 29, 2024

హత్రాస్ కేసు దర్యాప్తులో జోరు పెంచిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

CBI intensifies probe into Hathras case

 

బాధితురాలి తల్లిని క్రైమ్ సీన్ వద్దకు తీసుకెళ్లిన అధికారులు

లక్నో: హత్రాస్ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణమైన స్థితిలో ఆస్పత్రిలో కన్ను మూసిన 19 ఏళ్ల దళిత యువతి మృతి కేసులో విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో సిబిఐ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి సొంత గ్రామానికి చేరుకుంది. డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు సీమా పహూజా నేతృత్వంలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, బాధితురాలి సోదరుడితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అంతేకాకుండా బాధితురాలి తల్లిని కూడా క్రైమ్ సీన్ వద్దకు తీసుకు వెళ్లి వివరాలు తెలుసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అనంతరం అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు. కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, నాలుక కోసి, వెన్నెముక విరిచి అత్యంత పాశవికంగా హింసించడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్ల్లువెత్తడంతో సెప్టెంబర్ 30న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కేసు విచారణకై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అనంతరం దర్యాప్తును సిబిఐకి అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News