Monday, April 29, 2024

బీర్భూమ్ ఘటనపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -
CBI probe into Birbhum incident
కలకత్తా హైకోర్టు ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వ సాయానికి సూచన
సిట్ విచారణకు బ్రేక్
తనంతతానుగా తక్షణ స్పందన

కోల్‌కతా : బీర్భూం హత్యాకాండపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ దర్యాప్తులో పూర్తిగా సహకరించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వారం ఆరంభంలో జిలాలోని బోగ్టుయి గ్రామంలో మారణకాండ చెలరేగింది. ఈ ఘటనలో కనీసం ఎనమండుగురు మృతి చెందారు. పది ఇళ్లు తగులబడ్డాయి. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఘటన దర్యాప్తును సిబిఐ తమ ఆధీనంలోకి తీసుకోవాలని, తదుపరి కోర్టు విచారణ సమయానికి తమకు ప్రాధమిక దర్యాప్తు నివేదిక అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. జరిగిన ఘటనలోని తీవ్రతను ప్రాతిపదికగా తీసుకుని హైకోర్టు దీనిపై తనంతతానుగా స్పందించింది. జరిగిన ఘటన అక్కడి ప్రాధమిక సాక్షాధారాలను బట్టిచూస్తే దీనిపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు నిష్ఫక్షపాతంగా చేపట్టాల్సి ఉందని తాము అభిప్రాయపడుతున్నట్లు ధర్మాసనం తెలిపింది. న్యాయ ప్రయోజనాల కోణంలో ప్రజలలో చట్టంపై విశ్వాసాలు సడలిపోకుండా ఉండేందుకు దీనిపై సిబిఐ దర్యాప్తు అవసరం అని హైకోర్టు తేల్చిచెప్పింది. వెంటనే సిబిఐ రంగంలోకి దిగాలి. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది.

ఎప్రిల్ 7వ తేదికి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ దుర్ఘటన జాతీయ స్థాయిలో ప్రకంపనలకు దారితీసింది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తునకు తాము ఆదేశిస్తున్నామని, దీనికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సిట్ ఇకపై ఎటువంటి చర్యలకు పాల్పడరాదు. సంబంధిత కేసులోని అన్ని పత్రాలను , నిందితులు, అనుమానితులందరినీ తమ ఆదేశాలతో జరిగే సిబిఐ దర్యాప్తు బృందానికి అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు హైకోర్టు రాష్ట్ర పోలీసు విభాగానికి ఆదేశాలు వెలువరించారు. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు వెలువరించింది. జరిగిన దారుణం తీవ్రతను బట్టి చూస్తే ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు తంతు అంచనాల మేరకు లేదనే తాము అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. సిట్ విచారణ క్రమంలో లోపాలు ఉన్నట్లు పరోక్షంగా ఎత్తిచూపింది.అయితే ఈ వివరాలను వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News