Saturday, April 27, 2024

ఇన్సూరెన్స్ కుంభకోణం: సత్యపాల్ మాలిక్ ఇంటికి సిబిఐ అధికారులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెండు ఫైళ్లకు ఆమోద ముద్ర వేసేందుకు తనకు రూ. 300కోట్ల ముడుపులు ఆశచూపారంటూ ఆరోపణలు చేసిన జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించేందుకు శుక్రవారం సిబిఐ ఆయన నివాసానికి చేరుకుంది. ఆర్‌కె పురం ప్రాంతంలోని సోమ్ విహార్‌లో నివసిస్తున్న మాలిక్ నివాసానికి ఉదయం 11.45 సమయంలో సిబిఐ అధికారులు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆరోపణలపై వివరణ కోరేందుకే సిబిఐ ఆయనను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మాలిక నిందితుడు లేదా అనుమానితుడు కాదని వారు చెప్పారు.

గత ఏడు నెలల కాలంలో మాలిక్‌ను సిబిఐ ప్రశ్నించడం ఇది రెండవసారి. జమ్మూ కశ్మీరు గవర్నర్‌గా పదవి నుంచి తప్పుకున్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మాలిక్ వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు నమోదు చేశారు.
తాజాగా..వివరణ కోరుతూ సిబిఐ అధికారులు పంపించిన నోటీసుకు మాలిక్ ట్విటర్ వేదికగా స్పందించారు. నిజాలు మాట్లాడి కొందరు వ్యక్తుల పాపాలను నేను బయటపెట్టాను. అందుకే నన్ను సిబిఐ అధికారులు కలుసుకోవచ్చు. ఏను ఓ రైతు కొడుకుని. నేను భయపే ప్రసక్తే లేదు. నిజంపైనే నిలబడతాను..అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Also Read: విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

జమ్మూ కశ్మీరులోని ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌తోపాటు రూ. 2,200 కోట్ల విలువైన కిరూ హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పనులకు చెందిన రెండు కాంట్రాక్టులను అప్పగించడంపై అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐ నమోదు చేసింది.
2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మూ కశ్మీరు గవర్నర్‌గా పనిచేసిన కాలంలో ఈ రెండు కాంట్రాక్టులకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తే రూ. 300 కోట్ల ముడుపులు ముట్టచెబుతామంటూ కొందరు వ్యక్తులు తనకు ఆశ చూపారని సత్యపాల్ మాలిక్ అప్పట్లో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News