Monday, April 29, 2024

క్యాట్ కార్డ్ తరహాలో కొత్త పథకాలు

- Advertisement -
- Advertisement -

CCTV cameras at Bus stand for safety of passengers

ఆర్‌టిసి బస్సు ప్రయాణమే సురక్షితం : ఎండి సజ్జనార్
ప్రయాణికుల భద్రత కోసం బస్టాండ్‌లో సిసి కెమెరాలు

మనతెలంగాణ/నల్లగొండ: ఆర్‌టిసి బస్సులో ప్రయాణమే ప్రజలకు సురక్షితమని ఆర్ టిసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి ఆర్‌టిసి బస్సులో ప్రయాణించి నల్లగొండ, మిర్యాలగూడ డిపోలు, బస్టాండ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఆర్‌ఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్ ప్రజల పల్లె, పట్టణాలకు వెళుతున్న ప్రయాణికులు ఆర్‌టిసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ఆర్‌టిసి క్యాట్ కార్డ్ తరహాలో కొత్త రాయితీ పథకాలను అమలు చేయనున్నట్టు తెలిపా రు. వివాహ, వనభోజన, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలకు ఆర్‌టిసి బస్సులను అందుబాటులో ఉంచినందున వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

అడ్వాన్స్ లేకుండానే బుకింగ్

ఆర్‌టిసి చేసుకోవాలంటే గతంలో అడ్వాన్స్ చెల్లించే పద్ధతి ఉండేదని, ప్రస్తుతం ఎ లాంటి ఆడ్వాన్సులు లేకుండానే బస్సులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల భద్రత కోసం రా ష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌టిసి బస్టాండుల్లో రాజకీ య పార్టీలు, ఇతర సంస్థలతో సంప్రదించి సిసి కె మెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నా రు. సంస్థకు ఆదాయం సమకూర్చేందుకు 49వేల మంది సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తు న్నారన్నారు. ఆర్‌టిసి కార్గో సేవలకు మంచి స్పం దన వస్తుందన్నారు. బస్టాండ్లలో విక్రయించే వ స్తువులను ఎంఆర్‌పి కంటే అధికంగా అమ్మితే చ ర్యలు తీసుకుంటామన్నారు. బస్టాండ్లలో పోస్టర్లు వేసిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన కేసులు పెడతామని, ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌ల లో కేసుల పెట్టినట్లు గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News