Saturday, May 4, 2024

కొలీజియం సిఫార్సునకు 8 నెలలు హైకోర్టు జస్టిస్‌ల బదిలీలకు కేంద్రం ఓకె

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డిరమేష్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి లలిత కన్నెగంటిని కర్నాటక హైకోర్టుకు పంపించారు. గుజరాత్ హైకోర్టు జస్టిస్ విపుల్ ఎం పంచోలిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే వీరి బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 8 నెలల క్రితం కేంద్రానికి సిఫార్సు చేయగా ఇప్పుడు వీరి బదిలీ ప్రక్రియ ప్రకటనలు వెలువడ్డాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఈ పరిణామాన్ని గురువారం తమ ట్వీటులో తెలిపారు.

జస్టిస్ రమేష్, కన్నెగంటిల బదిలీలను కొలీజియం 2022 నవంబర్‌లో సిఫార్సుగా కేంద్రానికి పంపించింది. కాగా జస్టిస్ జస్టిస్ పంచోలీ బదిలీ నిర్ణయాన్ని కొలీజియం గత ఏడాది నవంబర్‌లోనే ప్రకటించి, సిఫార్సును కేంద్రానికి పంపించింది. కానీ గుజరాత్ హైకోర్టు లాయర్స్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది. సంబంధిత విషయంపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు సంఘం నుంచి మూడు పేజీల అభ్యంతర అభ్యర్థన పంపించారు. పంచోలీని గుజరాత్ హైకోర్టు నుంచి పంపించడం అనుచితం అని , బదిలీకి కారణం ఏదీ కన్పించడం లేదని, పైగా హైకోర్టులో ఆయన సీనియర్ జడ్జి అని సంఘం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News