Wednesday, May 1, 2024

ఆశావర్కర్లను అభినందించిన కేంద్ర బృందం

- Advertisement -
- Advertisement -

Asha Workers

 

రెడ్ జోన్లలో విస్త్రృత స్థాయి పర్యటన
ఆదివారం వనస్థలిపురంలో కంటైన్‌మెంట్ జోన్ పరిశీలన
ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా

మన తెలంగాణ /హైదరాబాద్ : రెడ్‌జోన్లలో పనిచేస్తున్న ఆశావర్కర్లు, ఇతర సిబ్బంది అద్బుతంగా పనిచేస్తున్నారంటూ కేంద్ర బృందం కితాబిచ్చింది.

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కేంద్ర నుంచి వచ్చిన ప్రత్యేక బృందం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తుంది. కేంద్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విధులు నిర్వర్తిస్తున్న డా జయంతి దాస్, డా దీపయాన్ బెనర్జీలతో కూడిన బృందం కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనుంది. దీనిలో భాగంగా ఈ టీం ఆదివారం వనస్థలిపురం కంటైన్‌మెంట్ జోన్‌కి వెళ్లి అక్కడి ఏర్పాటు చేసిన కరోనా కట్టడి సౌకర్యాలను పరిశీలించారు. రెడ్‌జోన్‌లో ఉన్న ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా శానిటేషన్‌పై అత్యధిక దృష్టి సారించాలని రాష్ట్ర వైద్యాధికారులను ఈబృందం సూచించింది. రెడ్‌జోన్లలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని నిత్యం పిచికారి చేయాలని సూచించారు. అనంతరం ఆశావర్కర్లతో కలసి ఇంటింటికి తిరుగుతూ కరోనా నియంత్రణ చర్యలను స్వయంగా పరిశీలించారు. సుమారు రెండు మూడు గంటల పాటు పర్యవేక్షించి కరోనా కట్టడి ఏర్పాట్లపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న సిబ్బంది అద్బుతంగా పనిచేస్తున్నారని కేంద్ర బృందం అభినందనలు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News