Wednesday, May 1, 2024

మెడిసిన్‌లో కోటా

- Advertisement -
- Advertisement -

వైద్య విద్యలో ఒబిసిలకు 27%, ఇడబ్లుఎస్‌కు 10% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు
అఖిల భారత కోటా పరిధిలో అమలు చేయనున్నట్టు ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో వైద్య కోర్సులలో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒబిసి 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఇడబ్యూఎస్) 10% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సవరించిన రిజర్వేషన్ల విధానం ఈ విద్యా సంవత్సరం అంటే 2021 2022 నుంచే అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. రిజర్వేషన్లు యూజి (ఎంబిబిఎస్, బిడిఎస్, పిజి, దంత) వైద్య విద్యాకోర్సులకు వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లను అఖిల భారత కోటా (ఎఐక్యూ) స్కీం పరిధిలో మలు చేస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎంబిబిఎస్‌లో ప్రతి ఏటా 15 00 మంది విద్యార్థులు, పిజిలో 2500 మంది ఒబిసి విద్యార్థులకు ప్రయోజనం కల్గుతుందని అంచనా వేశారు. ఇక ఇడబ్లుఎస్ విభాగంలో 550 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు, పిజిలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుంది.
ఇది బిసి విద్యా వికాసం ః ప్రధాని మోడీ
వెనుకబడిన వర్గాలకు వైద్య విద్యలో రిజర్వేషన్ల కల్పన చారిత్రక నిర్ణయం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఏడాది నుంచే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతి ఏడాది వేలాది మంది యువతీ యువకులకు సరికొత్తగా విద్యా అవకాశాలు దక్కుతాయి. దేశంలో సరైన సామాజిక న్యాయానికి, ఈ దిశలో సరికొత రూపానికి మార్గం ఏర్పడుతుందన్నారు. ఇక ప్రతిభ కల విద్యార్థులు ఇతర రాష్ట్రాలలో మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా 1986లో జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెలువరించింది. అయితే ఇది 2007 వరకూ కూడా ఆలిండియా కోటా పరిధిలో ఈ రిజర్వేషన్ల ఉత్తర్వులు అమలు కాలేదు. ఆ తరువాత వైద్య విద్యలో ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇతర వర్గాల విద్యార్థులకు కూడా మేలు జరుగుతుంది.
ఉన్నత స్థాయి భేటీలో ప్రధాని ఆదేశాలతోనే
సంబంధిత రిజర్వేషన్ల కోటా అమలుపై పరిష్కారం దిశలో ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం ఓ సమావేశం జరిగింది. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య అయినందున దీనిపై సమర్థవంతమైన పరిష్కార మార్గం అన్వేషించి స్పందించాలని సంబంధిత మంత్రిత్వశాఖలకు ప్రధాని ఈ నేపథ్యంలో ఆదేశాలు వెలువరించారు. ఈ మేరకు ఇప్పుడు ఈ నిర్ణయం ప్రకటన వెలువడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
బిసి, ఇడబ్లుఎస్ కేటగిరిలకు కోటా
తమ ప్రభుత్వం వైద్య విద్యలో బిసి కేటగిరి, అదే విధంగా ఇబిసి కేటగిరిలకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని , ఒబిసిలకు27 శాతం, ఇడబ్లుఎస్ పరిధిలో పది శాతం రిజర్వేషన్ల కల్పనకు తీసుకున్న నిర్ణయం చారిత్రకం అని ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయా ప్రకటన వెలువరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒబిసి విద్యార్థులు ఆలిండియా కోటా (ఎఐక్యూ) పరిధిలలో రిజర్వేషన్ల ప్రయోజనం దక్కించుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో నుంచి అయినా సీటు కోసం పోటీ పడే వీలేర్పడుతంది. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్కీం కావడంతో ఒబిసి సంబంధిత కేంద్ర జాబితాను ఈ రిజర్వేషన్ల ప్రయోజనానికి వాడుకోవచ్చు. బుధవారం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సారథ్యపు ఒబిసి ఎంపీల ప్రతినిధి బృందం ప్రధాని మోడీని కలుసుకుంది. ఒబిసి, ఇడబ్లుస్ విద్యార్థులకు నీట్ యుజి, పిజిల ఆలిండియా కోటాను సముచిత రీతిలో అమలు చేయాల్సి ఉందని డిమాండ్ చేసింది. సుదీర్ఘ కాలంగా అంటే దాదాపుగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పుడు ప్రధాని మోడీ సారథ్యంలోనే సమజంలోని అన్ని వర్గాలు, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినవారు, దళితులు, ఎస్‌టిలు, ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యన్నతికి కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇది హర్షదాయకం అని యాదవ్ ఓ ప్రకటన వెలువరించారు.
విద్యార్థులు స్థానికత అతీతంగా తమ ప్రతిభ అర్హతగా విద్యా అవకాశాలు పొందేందుకు 1986లో ఆలిండియా కోటా స్కీం (ఎఐక్యూ)ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రవేశపెట్టారు. వైద్య విద్యాకోర్సులలో చేరే వారు డొమిసిల్ సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలలోని ఉత్తమ ప్రమాణాల మెడికల్ కాలేజీలలో కూడా ప్రవేశం దక్కించుకునేందుకు ఈ కోటా స్కీం తోడ్పడింది. 2007 వరకూ సరైన రీతిలో అమలులోకి రాలేదు.
పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 2007లో సుప్రీంకోర్టు తమ ముందుకు వచ్చిన వ్యాజ్యాలపై స్పందించింది. కోటా స్కీంలో ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5 శాతం కోటాను ఖరారు చేసింది. ఈ దశలోనే కేంద్ర విద్యా సంస్థలు (ప్రవేశాలలో రిజర్వేషన్ల) చట్టం కార్యరూపం దాల్చింది. అప్పుడు సార్వత్రికంగా 27 శాతం రిజర్వేషన్లను ఒబిసిలకు కల్పించారు. ఇది పలు కేంద్రీయ విద్యా సంస్థలు అయిన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగే మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, బనారస్ హిందూ వర్శిటీల్లో దీనిని అమలులోకి తెచ్చారు. అయితే ఇదే క్రమంలో దీనిని రాష్ట్ర ప్రభుత్వ వైద్య దంత కళాశాలల ఎఐక్యూ సీట్ల పరిధిలోకి విస్తరింపచేయలేదు.
2019లో రాజ్యాంగ సవరణ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరిలోని విద్యార్థులకు విద్యా ప్రయోజనాల కల్పనకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలలో వారికి అవకాశాలు దక్కేందుకు 2019లో రాజ్యాంగ సవరణకు దిగారు. దీనితో ఈ కేటగిరిలోని వారిఇక పది శాతం రిజర్వేషన్లకు వీలేర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వచ్చేలా ఒబిసిలకు 27 శాతం, ఇడబ్లుఎస్‌లకు పది శాతం కోటా అమలు, దీనిని ఆలిండియా కోటాకు వర్తింపచేయడం వంటి అంశాలను పొందుపర్చడం జరిగిందని ఆరోగ్య మంత్రి తెలిపారు.

Centre announces Reservation in Medical Courses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News