Monday, April 29, 2024

జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Centre Releases GST Compensation to states

తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు

హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తుసేవా పన్నుల పరిహారం విడుదల చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 202122 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ తాజాగా విడుదలైన నిధులతో కలిపి వస్తుసేవల పన్ను పరిహారం కింద రాష్ట్రాలకు రూ.60వేల కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసిన వస్తుసేవల పన్ను పరిహారంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.279.1866కోట్లు లభించాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.542.9916కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర ఆర్ధిక శాఖ మొత్తం 31రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఈ నిధులు విడుదల చేసింది. అయితే ఇందులో మణిపూర్ ,అరునాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్‌కు ఈ ధఫా నిధులు విడుదల కాలేదు. సిక్కింకు అత్యల్పంగా రూ.30.53లక్షలు విడుదలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వస్తుసేవా పన్నుల పరిహారంలో సింహభాగం నిధులను ఐదు రాష్ట్రాలే దక్కించుకున్నాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.3053కోట్లు లభించాయి. కర్ణాటక, గుజరాత్ ,తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రా్రష్ట్రాలకు అధిక నిధిలు లభించాయి. అస్సాంకు రూ.159కోట్లు, బీహార్‌కు రూ342కోట్లు, చత్తిస్‌గడ్‌కు రూ.274కోట్లు, ఢిల్లీకి రూ.1155కోట్లు, గోవాకు రూ.163కోట్లు , గుజరాత్‌కు రూ.1428కోట్లు, హర్యానాకు రూ.518కోట్లు విడులయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌కు రూ.177కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.168కోట్లు , జార్ఖండ్‌కు రూ.264కోట్లు , కర్ణాటకకు రూ.1602కోట్లు ,కేరళకు రూ.673కోట్లు , మధ్యప్రదేశ్‌కు రూ.542కోట్లు, మహారాష్ట్రకు రూ.3053కోట్లు , మేఘాలయకు రూ.27కోట్లు , ఒడిశాకు రూ.286కోట్లు , పుదుచ్చేరికి రూ.61కోట్లు, పంజాబ్‌కు రూ834కోట్లు, రాజస్థాన్‌కు రూ.653కోట్లు, సిక్కింకు రూ.0.3053కోట్లు, తమిళనాడుకు రూ1314కోట్లు, త్రిపురకు రూ.16కోట్లు , ఉత్తరప్రదేశ్‌కు రూ.1417కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.270కోట్లు , పశ్చిమబెంగాల్‌కు రూ.771కోట్లు విడుదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News