Monday, April 29, 2024

రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Chakali Ilamma was a great warrior

 

హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు..రజాకర్లు, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా  ఐలమ్మ చిత్రపటానికి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలాగా ఉద్యమకారులకు అన్నం పెట్టిన మహనీయురాలు ఐలమ్మ అని మెచ్చుకున్నారు.  దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆనాటి ఉద్యమమే మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయిందని ప్రశంసించారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిన గొప్ప ధైర్యవంతురాలు అని ప్రశంసించారు. ఆమె తన నియోజకవర్గ ప్రాంతంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News