Wednesday, May 1, 2024

వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

Rafale induction ceremony at IAF airbase

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో శత్రు సేనలను వెంటాడే రఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరాయి. భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఫ్లారెన్స్ పార్లీలు ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సంధర్భంగా హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వాటర్ క్యానన్లు రఫెల్ యుద్ధ విమానాలకు సెల్యూట్ చేశాయి. తర్వాత ఫైటర్ జెట్లు నిర్వహించిన వాయు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదూరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్‌అండ్‌డి కార్యదర్శి, డిఆర్‌డిఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News