Thursday, May 9, 2024

వారు వేధించడంతో అమర రాజా, జాకీ కంపెనీలు పారిపోయాయి: బాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసిపి ప్రభుత్వ పతనం ఖాయమైందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతుందని, వైసిపి పాలనలో ఎపి ధ్వంసమైందని, ఐదేల్ల వైసిపి పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని దుయ్యబట్టారు. రాతియుగం వైపు వెళ్తారా?… స్వర్ణయుగం కోసం తనతో వస్తారా? అని అడిగారు. అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామని, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్‌కు ఓటేశారని, జగన్‌కు తెలసింది.. రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులేనని చురకలంటించారు.

ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కును అటకెక్కించారని, ఓర్లకల్లుకు 15 నెలల్లో విమానాశ్రయం తీసుకొచ్చామని, రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, అవుకు టన్నెల్‌ను తామే పూర్తి చేశామని గుర్తు చేశారు. జగన్ వచ్చాక రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమ ద్రోహి జగన్ అని మండిపడ్డారు. రాయలసీమకు 350 టిఎంసిల నీరు తీసుకరావడంమే తన లక్షమన్నారు. గోదావరి నీటిని బనకచర్లకు తీసుకరావాలనేది తన ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారని, ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మెగా డిఎస్‌సి అన్నారని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్ ప్రభుత్వం వేధించడంతో అమర రాజా, జాకీ కంపెనీలు పారిపోయాయన్నారు. యువత జనసేన-టిడిపి జెండా పట్టుకొని ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తన కలిసి నడవాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని, జగనన్న వదిలిన బాణం ఎప్పుడు ఎక్కడ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు ఆడారని చంద్రబాబు దుయ్యబట్టారు. వివేకా కుమార్తె, సిబిఐ అధికారులపైనా కేసులు పెట్టారని, చెత్తపై కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News