Saturday, May 11, 2024

దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు

- Advertisement -
- Advertisement -

corona

 

ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే
రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో 319 జిల్లాలు
21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్‌గా పరిగణన
ప్రతివారం జాబితా సమీక్ష
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొడిగించిన లాక్‌డౌన్ గడువు ఆదివారం(ఈ నెల 3వ తేదీ)తో ముగియనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతిసుదాన్ శుక్రవారం లేఖ రాశారు. గతంలో నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరంజ్ జోన్లలో మార్పులు చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 3వ తేదీన లాక్‌డౌన్ రెండో దశ ముగిసిన తర్వాత కరోనా కట్టడి చర్యలు చేపట్టడం కోసం వారం రోజుల పాటు ఈ జిల్లాల వర్గీకరణ అమలులో ఉంటుందని, ప్రతివారం ఈ జాబితాను సవరించి తదుపరి చర్యలు కోసం ఆయా రాష్ట్రాలకు తెలియజేయడం జరుగుతుందని ఆమె ఆ లేఖలో తెలియజేశారు. తాజా వర్గీకరణలో కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ముంబయి, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ లాంటి మెట్రో నగరాలను రెడ్‌జోన్‌లో చేర్చారు.

గత నెల 30న కేంద్ర కేబినెట్ కార్యదర్శి వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యదర్శులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఈ జిల్లాల తాజా వర్గీకరణ జరిగింది. కొత్త జాబితా ప్రకారం రెడ్ జోన్‌లో 130 జిల్లాలు,ఆరెంజ్ జోన్‌లో 284 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో 319 జిల్లాలు ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలు రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. అత్యధికంగా యుపిలో19 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండగా ఆరంజ్ జోన్‌లో 36 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో 20 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలో14 జిల్లాలు రెడ్‌జోన్‌లో, 16 జిల్లాలు ఆరంజ్ జోన్‌లో,ఆరు జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. కాగా గుజరాత్‌లో9 జిల్లాలు రెడ్‌జోన్‌లో, ఆరంజ్ జోన్‌లో 19 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో అయిదు జిల్లాలున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లో రెడ్‌జోన్‌లో 9 జిల్లాలుండగా, ఆరంజ్ జోన్‌లో 19 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో 24 జిల్లాలున్నాయి. ఇక రాజస్థాన్‌లో8 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండగా, ఆరంజ్ జోన్‌లో 19, గ్రీన్ జోన్‌లో ఆరు జిల్లాలున్నాయి.

ఇక తమిళనాడులో12 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండగా, ఆరంజ్ జోన్‌లో 24 జిల్లాలున్నాయి. గ్రీన్‌జోన్‌లో ఒక్క జిల్లా ఉంది. ఈ రాష్ట్రాలన్నీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కావడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండగా,18 జిల్లాలు ఆరంజ్ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అయిదు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 7 జిల్లాలు ఆరంజ్ జోన్‌లో ఉన్నాయి. ఒక్క జిలా ్ల(విజయనగరం) గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. కాగా, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. మరోవైపు అసోం, హిమాచల్‌ప్రదేశ్, లడఖ్, మేఘాలయ, పుదుచ్చేరి, త్రిపురలాంటి కొన్ని రాష్ట్రాల్లో రెడ్‌జోన్ జిల్లాలు లేవు. కొన్ని జిల్లాలను రెడ్‌జోన్‌లో చేర్చడం పట ్లకొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలియజేశాయని సుదాన్ ఆలేఖలో పేర్కొంటూ, ఇది క్రియాశీలక (డైనమిక్)జాబితా మాత్రమేనని తెలిపారు.

క్షేత్రస్థాయిఆధారంగా, రాష్ట్రస్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా కొత్తగా ఏవయినా జిల్లాలను రెడ్‌జోన్, ఆరంజ్ జోన్లలో చేర్చవచ్చని తెలిపారు. అయితే మంత్రిత్వ శాఖ రెడ్‌జోన్ లేదా, ఆరంజ్ జోన్లుగా వర్గీకరించిన జోన్లలో రాష్ట్రాలు ఎలాంటి పడలింపులు చేయడానికి వీలు లేదని ఆ లేఖలో స్పష్టంచేశారు.అంతేకాకుండా ఒక జిల్లాలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మున్సిల్ కార్పొరేషన్లు ఉన్న పక్షంలో ఆ జిల్లాలోని మిగతా ప్రాతాలను ప్రత్యేక యూనిట్లుగా పరిగణించడం జరుగుతుందని కూడా తెలిపారు. కాగా ఇప్పటివరకు పాజిటివ్ కరోనా కేసులు లేని, లేదా, గత 21 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కాని జిల్లాను గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారని ఆ లేఖలో తెలియజేశారు.

 

Changes in classification of zones across country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News