Monday, April 29, 2024

కొడుకే..వాడిని ఉరితీసినా తప్పులేదు

- Advertisement -
- Advertisement -

ఉజ్జయిని : స్థానికంగా ఓ 12 ఏండ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలవరానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పట్టుబడ్డ యువకుడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. వీడు తన కొడుకు అయినా వదిలిపెట్టవద్దని, ఉరిశిక్ష వేసి చంపివేయాలని తండ్రి పోలీసులను కోరాడు. కాగా నిందితుడి తరఫున ఏ లాయరు వాదించరాదని స్థానిక బార్ అసోసియేషన్ అందరికి విజ్ఞప్తి చేసింది. ఘటనకు సంబంధించి గురువారం భారత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టు అయిన యువకుడిని స్థానికులు చితకబాదారు. దీనితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు సిగ్గుమాలిన చర్యకు దిగారని , తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని , తాను కొడుకును చూసేందుకు ఆసుపత్రికి వెళ్లదల్చుకోలేదని తండ్రి తెలిపారు.

ఇప్పుడు వాడికోసం ఎవరూ పోలీసు స్టేషన్‌కు , కోర్టులకు వెళ్లడం లేదని, వెంటనే ఉరితీయడం మంచిదని తండ్రి వాపోయ్యాడు. ఉజ్జయిని ఆలయ క్షేత్రం అని,ఈ పవిత్ర స్థలం పరువు పోయిందని స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షులు అశోక్ యాదవ్ స్పందించారు. లాయర్లు ఎవరూ ఈ దుండగుడి తరఫున వాదించరాదని సూచించారు. 12 ఏండ్ల బాలిక ఇటీవల ఇక్కడి వీధులలో నడవలేని స్థితిలో తడబడుతూ కన్పించింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమెపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు నిర్థారించారు. బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మహిళలకు చివరికి బాలికలకు కూడా దిక్కులేకుండా పోయిందని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికలు జరిగే ఈ రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడిగే అమిత్ షా కానీ ప్రధాని మోడీ కానీ ఇటువంటి దారుణాలపై ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ విరుచుకుపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News