Monday, May 6, 2024

నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
Chief Minister K Chandrasekhar Rao is visiting to Delhi
26న హోం శాఖ సమావేశానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం బిఎసి భేటీ ముగిసిన తరువాత బేగంపేట విమానాశ్ర యం నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కె సిఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా…మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేం ద్రహోంశాఖ ఆదివారం (26న) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ స మావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణతోపాటు ఎపి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పా ల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఈ పర్యటనలో భాగంగా 25వ తేదీన న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సిఎం కెసిఆర్ సమావేశమౌతా రు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశా లు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. ఆదివారం (26న తేదీన) విజ్జానభవన్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆ హార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూ ష్ గోయల్‌తో సిఎం భేటీ అవుతారు. ధా న్యం కొనుగోళ్ల అంశంపై సిఎం చర్చిస్తారు. అదే రోజున సిఎం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా ఈనెలలోనే సిఎం కెసిఆర్ రెండ్లు సార్లు ఢిల్లీకి వె ళ్లడం విశేషం. ఈ నెల 1వ తేదీన మొదటిసారిగా ఆయన ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో టిఆర్‌ఎస్ కార్యాలయం నిర్మాణ ప నుల శంకుస్థాపన కోసం వెళ్లారు.. 2వ తేదీ న ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3వ తేదీన ప్రధాని మోడీతో కెసిఆర్ సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News