Wednesday, May 1, 2024

భూటాన్‌లో చైనా పాగా

- Advertisement -
- Advertisement -

9 కిలోమీటర్ల పక్కా రోడ్
కనుమల వెంబడి నిర్మాణాలు
శాటిలైట్ చిత్రాలతో వెల్లడి
2017 కయ్యాల ప్రాంతంలోనే కబ్జాలు

China occupied bhutan land

న్యూఢిల్లీ: లేదు లేదు కాదు కాదంటూనే డోక్లాం ప్రాంతం లోని భూటాన్ భూభాగంలో చైనా సైనిక బలగాలు అతిక్రమణకు పాల్పడిన విషయం స్పష్టం అయింది. అక్కడ రెండు కిలోమీటర్ల పరిధిలో చైనా గ్రామం వెలిసింది. పైగా దాదాపుగా 9కిలోమీటర్ల పొడవైన రాదార్లను కూడా నిర్మించుకుంది. అత్యంత సాంద్రతతో కూడిన నిర్థిష్ట ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ఈ విషయం స్పష్టం అయింది. అత్యంత వివాదాస్పద ప్రాంతం అయిన డోక్లా మ్ పీఠభూమిలో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుందని వార్తలు వెలువడ్డాయి.అయితే ఇటువంటిదే మీ లేదని చైనా అధికారికంగా తెలియచేసుకుంది. కానీ ఇప్పుడు వెలువడ్డ శాటిలైట్ ఇమేజ్‌లతో డోక్లామ్ తూర్పు ప్రాంతంలో చైనా చేష్ట గురించి స్పష్టం అయింది. భూటా న్ ప్రాదేశిక ప్రాంతంలో 9 కిలోమీటర్ల రోడ్‌ను వేసుకుని, చైనా తన సైనిక బలగాల వ్యూహాత్మక సరఫరాలకు, మరి న్ని భవిష్య అవసరాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టం అయింది. అత్యంత వ్యూహాత్మకంగా భౌగోళికం గా ప్రాధాన్యత ఉండే ప్రాంతాన్ని ఎంచుకునే చైనా ఈ ప్రాంతంలో తన సొంత గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది.

ఈ ప్రాంతంలో వెలిసిన రోడ్‌తో చైనా బలగాలకు జోంపె ర్లి కనుమల ప్రాంతానికి చేరేందుకు ప్రత్యామ్నాయ మా ర్గం దొరికినట్లు అయింది. దీనికి సంబంధించి 2017లో భారత సైన్యం కనబర్చిన ప్రతిఘటన ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో చైనా బలగాలు ఈ కనుమల ప్రాంతానికి అనుసంధాన ప్రక్రియకు యత్నించగా మన జవాన్లు దీనిని అడ్డుకున్నారు. దీనితో అప్పట్లో చైనా బలగాలు వెనుతిరిగాయి. ఆ దశలో భారత్ చైనా బలగాల మధ్య డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో ఘర్షణ చెలరేగింది. ఈ తరుణంలోనే చైనా నిర్మాణ కార్మికులు ఇక్కడి కనుమలకు దారి ఏర్పర్చుకునేందుకు యత్నించారు. అప్పటికే డోకా లా వద్ద ఉండే భారతీయ సైనిక స్థావరం దరిదాపుల వరకూ అంతకు ముందు ఉన్న రోడ్డును పొడిగించుకుని తీరాలని చైనా బలగాల సాయంతో నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ రోడ్డు పనులను భారతీయ సైనికులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అడ్డుకున్నారు. ఈ ప్రాంతానికి చైనా రోడ్డు ద్వారా అనుసంధానం అయితే చైనా బలగాలు చాలా తేలికగా చికెన్ నెక్ ప్రాంతానికి చేరుకుంటాయని , దీనితో భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మార్గంగా ఉండే అత్యంత కీలకమైన భూభాగంపై చైనా బలగాలకు పట్టు దక్కుతుందని పేర్కొంటూ మన బలగాలు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేశాయి.

అప్పటి తమ ప్రయత్నం విఫలం కావడంతో చైనా బలగాలు మూడు సంవత్సరాలు విరామం తరువాత ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే టోర్సా నదీ తీరం వెంబడి మరో రోడ్ నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. 2017 నాటి వివాదాస్పద ప్రాంతానికి ఇప్పటి రోడ్డు నిర్మాణ ప్రాంతం కేవలం పది కిలోమీటర్ల లోపే ఉంది. తమ భూభాగంలో చైనా ఎటువంటి గ్రామం లేదా ఇతరత్రా కట్టడాలకు దిగలేదని ఓ వైపు భూటాన్ కూడా చెపుతోంది. అయితే ఇది అబద్ధమని, భూటాన్ ప్రాంతంలోనే గ్రామం నిర్మితం అయి, రాదార్లు కూడా వెలిశాయని తాజా ఛాయాచిత్రాలతో వెల్లడైంది. 2017లో తలెత్తిన ఘర్షణ దరిమిలా నెలకొన్న సరిహద్దుల ప్రతిష్టంభన రెండు నెలలకు పైగా కొనసాగింది. అయితే తరువాత 2018 ఎప్రిల్‌ల వూహాన్‌లో ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోడీ చర్చల దశలో ఈ అంశంపై ఉద్రిక్తతల నివారణకు అంగీకారం కుదిరింది.

అయితే అప్పటి వివాదాస్పద ప్రాంతం దరిదాపుల జోలికి వెళ్లనట్లుగా చిత్రీకరించుకుంటూ చైనా బలగాలు ఇప్పుడు ఇతరత్రా ప్రాంతాలలో తమ నిర్మాణాలతో తరచూ మిగిలిన డోక్లామ్ యధాతథస్థితిని వ్యూహాత్మకంగా మార్చివేసుకుంటూ పోతోందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు డాక్టర్ బ్రహ్మ ఛెలెనీ విశ్లేషించారు. ‘ఇక్కడ చైనా బలగాల చాపకిందనీరు వ్యవహారాన్ని స్పష్టంగా తెలియచేసుకోవల్సి ఉంటుంది. వారు భూటాన్ ప్రాంతంలో ఊరు కట్టేసుకున్నారు. రోడ్లు చక్కబెట్టుకుంటున్నారు. అక్కడ శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏకంగా పీఠభూములు, కనుమలపైనే గుట్టుచప్పుడు కాకుండా తిష్టవేసుకున్నారు. ఇప్పటికైతే ఒక గ్రామం వెలిసినట్లు నిర్థారణ అయింది. ఓ దశలో నిర్మానుష్యంగా, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నట్లు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని నిర్మాణాలు జరిగాయి’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News