Monday, April 29, 2024

ఊటీలో ‘గాడ్ ఫాదర్’..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా… కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా షూటింగ్ గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్‌లో మెగాస్టార్ మీద పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Chiranjeevi’s ‘Godfather’ movie shooting at Ooty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News