Saturday, April 27, 2024

పల్లెలకు కదులుతున్న నగరం…

- Advertisement -
- Advertisement -

sankranthi-festival

హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల రోజుల్లో మాత్రం అన్నింటినీ మరీ పక్కన పెడుతున్నారు. అవసరం అనుకుంటే వారి చదువులకు వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి వారంతా అమ్మవడి లాంటి పల్లె బాట పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండుగలైన దసరా, సంక్రాంతి పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు తరలి వెళుతుంటారు.

నిత్యం అనేక వ్యవహరాల్లో మునిగి తేలుతున్న ప్రజలు సంక్రాంతి మూడు రోజుల పాటు అన్నింటిని మరిచిపోయి సేదతీరేందుక పల్లెలకు వెళుతున్నారు. రెండో శనివారం (11 తేదీ), ఆదివారం( 12వ తేదీ) ఈ విధంగా వరుస సెలవులు రావడమే కాకుండా 13 నుంచి పండగ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నగరంలోని రైల్వేస్టేషన్లకు, బస్టేషన్లకు చేరుకోవడంతో అవన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అడుగు తీసి అడుగు పెట్టలేనంతగా పరిస్థితి ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే ఎన్ని ప్రత్యేక రైళ్ళు నడిపినా అదనపు సీటు, బెర్తులు అందుబాటులోకి తీసుకు వచ్చినప్పటికి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసి పోయారు.

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, స్టేషన్ల నుంచి వెళుతున్న రైళ్ళు కిటకిటలాడాయి. రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు, సులువుగా ప్రయాణించగలిగినప్పటికి రిజర్వేషన్‌లేని వారు నానా ఇక్కట్లకు గురయ్యారు. వారందరు జనరల్ బోగీలను ఆశ్రయించాల్సి వచ్చింది. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు,గుంటూరు, తదితర ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళలో ప్రయాణికులు రద్దీ నెలకొంది.దీంతో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ అధికంగానే ఉంది. స్టేషన్ బయట, వెయిటింగ్ హళ్ళు, ఫ్లాట్‌ఫామ్‌లు ఎక్కడ చూసినా ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. రైలు బయలు దేరడానికి ముందుగానే ఫ్లాట్‌ఫామ్‌ల ప్రయాణికులు వేచి ఉంటున్నారు.

పిల్లలు, మహిళలు, వృద్దులు జనరల్ బోగీల్లో సీట్ల కోసం నాన తిప్పలు పడుతున్నారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్ర రోడ్దు రవాణా సంస్ణలు కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. అయినప్పటికి అటు ఆంద్రా, ఇటు తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ కిక్కిరి పోయాయి. జూబ్లీబస్‌స్టేషన్, ఇమ్లిబన్, బస్‌స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడాయి. అదే విధంగా ఇతర శివారు ప్రాంతాల్లోని బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పెద్ద ఎత్తును వేచి చూస్తున్నారు ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హస్తలాఘవం చూపుతున్న చోరులు…….
ప్రయాణికులు తాము ఎక్కాల్సిన బస్సులు, రైళ్ళ కోసం.. రైళ్ళకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటూ మరో వైపు చోరులు తమ హస్తలాఘవం చూపుతున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌డెస్క్‌లు సమీపంలో కూడా కనిపించక పొవడంతో ఏమీ చేయాలో తెలియక ప్రయాణికులు ఉసూరు మంటూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ అంశంపైగా ఆర్టిసి, పోలీసు అధికారుల సమన్వయంతో పని చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

city people is moving towards village for sankranthi festival

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News