Monday, April 29, 2024

ఉద్యోగాల వర్గీకరణ

- Advertisement -
- Advertisement -
Classification of jobs in Telangana
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మల్టీ జోన్ల కింద ఉద్యోగాల వర్గీకరణ, రాష్ట్ర కేడర్ రద్దు
87 విభాగాధిపతులకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ
పోలీసు నియామకాలతో పాటు అన్ని శాఖల్లో ఉద్యోగాలు
ఇక నుంచి కొత్త జోన్ల ప్రకారమే కేంద్ర హోంశాఖ ఆమోదంతో జిఒ 128 జారీ

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఆయా శాఖల్లోని పోస్టులను కేడర్‌ల వారీగా ప్రభుత్వం వర్గీకరించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 87 విభాగాధిపతులకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోన్లు, మల్టీజోన్లు, జిల్లా క్యాడర్ పోస్టులను వర్గీకరించాలని, పోలీసు నియామకాలతో పాటు అన్ని శాఖల నియామకాలపై ఇకపై కొత్త జోన్లు, మల్టీజోన్లే ప్రామాణికం కానున్నాయి.

ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కొత్త జోన్లే కీలకంగా మారనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలపగా కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో నారాయణ పేట జిల్లా జోగులాంభ జోన్‌లో, ములుగు జిల్లా కాళేశ్వరం జోన్‌లో, వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్ లో కలుపుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి కేంద్ర హోంశాఖ ఆమోదం ఇవ్వడంతో రాష్ట్రం జిఓ 128ని జారీ చేసింది. దీంతో జోనల్ వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్‌లు అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్ 2018లో భాగంగా లోకల్ క్యాడర్‌లను నిర్ధేశించారు.

ప్రస్తుతం ఉద్యోగుల క్యాడర్‌ను నూతన జోన్ల ప్రకారం

అందులో భాగంగా నూతన జోనల్ విధానంలో జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్‌లలో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉద్యోగుల క్యాడర్‌ను నూతన జోన్ల ప్రకారం విభజించారు. జోన్ల ఉనికి నే పథ్యంలో సర్వీస్‌రూల్స్ మారనున్నాయి. శాఖల వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను విభజించారు. కొత్త విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగ వాటాలో భారీ లబ్ధితో పాటు పదోన్నతుల్లో ఉద్యోగులకు భారీ ప్రయోజనంతో పాటు నియామకాలన్నీ మల్టీజోన్‌లకే పరిమితం చేయడంతో ప్రమోషన్‌లలో ఉద్యోగులకు కీలకస్థానం దక్కనుంది.

కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర క్యాడర్ రద్దు

కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర క్యాడర్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ పోస్టులు పదోన్నతులతో భర్తీ కానున్నాయి. అదే విధంగా గ్రూప్ 1 పోస్టుల భర్తీ కూడా మల్టీజోన్‌లలోనే జరగనున్నాయి. స్థానికతే కీలకం కావడంతో 61 రకాల పోస్టుల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు ద క్కుతాయని అధికారులు భావిస్తున్నారు. 34 రకాల పో స్టులను ప్రభుత్వం మల్టీ జోన్‌ల పరిధిలోకి తీసుకువచ్చింది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసేందుకు జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల నిష్పత్తి ప్ర స్తుతం 12.5 శాతం ఉండగా, దీనిని 25 శాతానికి పెంచనున్నారు. అన్ని శాఖల్లోని సీనియర్ అసిస్టెంట్ పోస్టుల వరకు, విద్యాశాఖలోని స్కూల్ అసిస్టెంట్‌ల వరకు జిల్లా క్యాడర్‌లోనే ఉండనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లోని సూపరింటెండెంట్ దానికి సమాన పోస్టులు జోనల్ క్యాడర్‌లోకి చేరనున్నాయి.

చాలా పోస్టులు మల్టీజోన్‌ల పరిధిలోకి..

కాగా మల్టీ జోన్ పరిధిలోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కలెక్టర్, సిటిఓ, ఆర్‌టిఓ, కో ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిపిఓ, డిస్ట్రిక్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ అధికారి, జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్లు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్, ఏఈఎస్, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా బిసి సంక్షేమ అధికారి, గిరిజన అధికారి, జిల్లా ఉపాధి కల్పనా అధికారి తదితర పోస్టులన్నీ మల్టీజోనల్‌గా మారనున్నాయి. పలు విభాగాల్లో మారిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

సిసిఎల్‌ఏ డిపార్ట్‌మెంట్‌లో…

జిల్లా కేడర్ పోస్టులు : టైపిస్ట్ (లోకల్ కేడర్), జూనియ ర్ అసిస్టెంట్ (లోకల్ కేడర్), జూనియర్ స్టెనో (లోకల్ కే డర్ ), డ్రైవర్ (లైట్ వెహికల్) (లోకల్ కేడర్),రికార్డు అసిస్టెంట్ (లోకల్ కేడర్), రోనియో ఆపరేటర్ (లోకల్ కే డర్), జామేదర్ (లోకల్ కేడర్ ), దఫేదార్ (లోకల్ కేడ ర్), కుక్ (లోకల్ కేడర్), ఆఫీస్ సబార్డినేట్ (లోకల్ కేడర్), శానిటరీ వర్కర్ (లోకల్ కేడర్), స్వీపర్ (లోకల్ కేడర్), వాచ్‌మెన్ (లోకల్ కేడర్), చైన్‌మెస్ (యూఎల్సీ).

జోనల్ కేడర్ పోస్టులు

నాయిబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ (లోకల్ కేడర్ ) ఎంఆర్‌ఐ / ఏఆర్‌ఐ, సీనియర్ స్టెనోగ్రాఫర్ ( లోకల్ కేడర్ ), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (యూఎల్సీ)

మల్టీ జోనల్ కేడర్ పోస్టులు

ఆర్డీవో / డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్ / తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (యూఎల్సీ).
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్‌మెంట్‌లో జిల్లా ..
జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), టైపిస్ట్ ( లోకల్ కేడర్ ), షరాఫ్ ( లోకల్ కేడర్ ), డ్రైవర్ ( లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ ), ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ ).
జోనల్ కేడర్ పోస్టులు: సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2, సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు: జిల్లా రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -1

సర్వే, సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్
రికార్డ్ డిపార్ట్‌మెంట్‌లో….

జిల్లా కేడర్ పోస్టులు : జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), టైపిస్ట్, డ్రైవర్ ( లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ ), రికార్డ్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), షరాఫ్, ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ ), చైన్‌మెన్.
జోనల్ కేడర్ పోస్టులు : సూపరింటెండెంట్, సీనియర్ డ్రాఫ్ట్‌మెన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్,
కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ -1, సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), కంప్యూటర్ కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ -2, డిప్యూటీ సర్వేయర్.
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు : అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే
ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
టైపిస్ట్ ( లోకల్ కేడర్ ), అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, డ్రైవర్ (లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ ), రికార్డ్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్), టెక్నికల్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ ), ఆఫీస్ సబార్డినేట్ కం క్లీనర్, వాచ్‌మెన్ ( లోకల్ కేడర్ ), క్లీనర్ ( లోకల్ కేడర్ ), ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ ).
జోనల్ కేడర్ పోస్టులు : అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఆడియో విజువల్ సూపర్ వైజర్, సీనియర్ అసిస్టెం ట్ ( లోకల్ కేడర్ ), ఇన్ఫర్మేషన్ టెక్నిషీయన్, పబ్లిసిటీ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ( లోకల్ కేడర్ ).
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( లోకల్ కేడర్ ), అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్

ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ జిల్లా కేడర్ పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), జూనియర్ స్టెనో ( లోకల్ కేడర్) టైపిస్ట్ ( లోకల్ కేడర్ ), శానిటరీ వర్కర్ ( లోకల్ కేడర్), వాచ్‌మెన్ ( లోకల్ కేడర్ ), ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ ), స్వీపర్ ( లోకల్ కేడర్), సేవక్.
జోనల్ కేడర్ పోస్టులు : సూపరింటెండెంట్ ( లోకల్ కే డర్ ), ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ ( నాన్ టెక్నికల్ ), సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ), సీనియర్ స్టెనో ( లోకల్ కేడర్ )
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు : అసిస్టెంట్ డైరెక్టర్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ ( లోకల్ కేడర్ ).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News