Saturday, April 27, 2024

గుండెలు పిండేసే రెండు ఘోరాలు

- Advertisement -
- Advertisement -

Seven people including three children killed in two fatal accidents

రాష్ట్రంలో ఇంచుమించు ఒకేచోట శుక్రవారం నాడు రెండు ఘోర దుర్ఘటనలు సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురిని బలి తీసుకున్నాయి. సంగారెడ్డిలో ఒక బ్యాంకు ఉద్యోగి భార్య తన ఇద్దరు కొడుకులను పీడిస్తున్న రోగాలు ఇక నయం కావని తెలుసుకొని వారిద్దరిని చున్నీతో ఉరివేసి తాను చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. చెరువు వద్ద గల జాలర్లు ఆమెను కాపాడారు. పిల్లలను ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మరో విషాద సంఘటనలో మెదక్ జిల్లా రంగంపేట, సంగాయిపేట గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆసుపత్రిలో ఐదేళ్ల బాలుడికి చికిత్స చేయించుకొని ఇంటికెళ్తుండగా అతివేగంగా నడుపుతున్న వారి కారు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే వారు దుర్మరణం పాలయ్యారు.

జీవితాంతం వెంటాడే వ్యాధుల బారిన పడిన ఇద్దరు మగ బిడ్డలకు చున్నీతో ఉరి వేసిన తర్వాత చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి సంగారెడ్డి ఆసుపత్రిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు.
ఐదేళ్ల బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్తుండగా కారును సంగారెడ్డి సమీపం చౌటకూరు వద్ద లారీ ఢీకొట్టడంతో చిన్నారితో సహా ఐదుగురు బలయ్యారు.
లారీని ఢీకొట్టిన కారు

మన తెలంగాణ/ సంగారెడ్డి (చౌటకూరు): రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంగారెడ్డి మండలం చౌటకూరు వద్ద నాందేడ్ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన లుకా (46), దీవెన(40), సంగయ్యపేట గ్రామానికి చెందిన అంబదాస్ (40), పద్మ(30), వారి కుమారుడు వివేక్ (5)లు కారులో ఉన్నారు. అంబదాస్, పద్మల కుమారుడు వివేక్ అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నాందేడ్ రహదారిపై చౌటకూర్ వద్ద వారి కారు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. కారు డ్రైవర్ అతి వేగం కారణంగానే జోగిపేట వైపు నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.

అతి వేగంగా లారీని ఢీకొట్టినందునే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.దీంతో నిత్యం వందలాది వాహనాలతో కిక్కిరిసి ఉండే నాందేడ్ రోడ్డు రక్తసిక్తం అయింది. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.పుల్కల్ ఎస్‌ఐ నాగలక్ష్మి సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.జిల్లా ఎస్‌పి రమణకుమార్ కూడా ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి పని అయిపోయి, ఇంటికి తిరిగి పోతున్న క్రమంలో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాద స్థలిని చూసిన వారు చలించిపోయారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో సంఘటనా స్థలిలో, జిల్లా ఆస్పత్రిలో విషాదం నిండిపోయింది.

ఐదుగురు దుర్మరణం
కొడుకుల గొంతు పిసికి చంపిన తల్లి
చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం

మన తెలంగాణ/ సంగారెడ్డి టౌన్ : కన్నతల్లేతన బిడ్డలను గొంతునులిమి చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి టౌన్ లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డిటౌన్‌లోని ఇండియన్ బ్యాంక్ లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శివకుమార్, భార్య జ్యోత్సకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రుద్రాక్షు (6), చిన్న కుమారుడు దేవాం శ్ (4). 7 నెలల క్రితం ఆదిలాబాద్ నుండి సంగారెడ్డి టౌన్‌కు బదిలీ పై వచ్చి శాంతినగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద అబ్బాయి పుట్టినప్పటి నుండి రెండు కిడ్నీలు, చిన్న అబ్బాయి మలబద్ధక సమస్యల తో బాధపడుతున్నారు. వీరికి బంజారాహిల్స్ అసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

చికిత్స అందిస్తున్న వైద్యులు పిల్లలకు ఈ జబ్బులు పూర్తిగా నయం కావని, జీవితాంతం ఉంటాయని తెలపడంతో తల్లి జ్యోత్సమనస్తాపాని కి లోనై పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించు కుంది. శుక్రవారం భర్త శివశంకర్ ఉద్యోగ నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లిన తరువాత మధ్యాహ్నం సమయంలో ఇంటిలో తన ఇద్దరు కుమారులను చున్నీ తో ఉరి వేసి చంపి ఇంటికి తాళం వేసి, మహబూబ్ సాగర్ చెరువు వద్ద కు చేరుకొని భర్తకు వాట్స్ అప్‌లో ఫోటో పంపి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే కట్ట మీద వున్న జాలర్లుఆమెను గమనించి ఒడ్డుకు చేర్చారు. వార్త తెలుసుకున్న భర్త ఇంట్లో మంచంపై పడి వున్న ఇద్దరు పిల్లలను, భార్యను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పిల్లలను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ప్రస్తుతం జ్యోత్సకు ఐసియులో చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News