Thursday, May 9, 2024

మురుగు నీటికి చరమగీతం

- Advertisement -
- Advertisement -

Minister KTR lays foundation stone for sewage

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అన్ని చెరువుల సుందరీకరణ
అక్కడి మురుగునీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్ల ఏర్పాటు
ఫతేనగర్ డివిజన్‌లో ఒక శుద్ధ జల ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ బాలానగర్: హైదరాబాద్ నగరంలో మురుగు నీటికి చరమ గీతాన్ని పాడి శుద్ధ జలంగా మార్చి నగరవాసులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకర వాతావరణాన్ని నెల కొల్పడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ ధ్యేయమని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 317 కోట్ల రూపాయలతో కూకట్‌పల్లి నియోజక వర్గంలో చెరువులను సుందరీకరించడంలో ఎస్‌టిపి ప్లాంట్‌ల నిర్మాణలో భాగంగా, ఫతే నగర్ డివిజన్ పరిధి లాల్ బహద్దూర్ శాస్త్రి నగర్‌లో ఏర్పాటు చేయనున్న మురుగు నీటిని శుద్ధ జలంగా మార్చే ప్లాంట్‌కు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, డిప్యూటి మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.  మంత్రి మాట్లాడుతూ మురుగు నీటిని శుద్ధ జలంగా మార్చే ప్లాంట్‌లతో నగరంలో మురుగు నీటి వ్యవస్థకు చరమగీతం పాడటంతో పాటు నగరంలోని భూగర్భ జలాలు కూడా పరిశుభ్రమై హైదరాబాద్ నగరం పరిశుభ్రమైన నగరం గా మారుతుందని అన్నారు. అంతే కాకుండా కూకట్ పల్లి నియోజక వర్గంలో ఉన్న మిగతా చరువుల వద్ద కూడా మురుగు నీటిని శుద్ధ జలంగా మార్చే ప్లాంట్ లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి కెటీఆర్ అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర ఆవతరించిన తరువాత ఏడేళ్ళ కాలంలో ముఖ్య మంత్రి కేసీఆర్ సార థ్యంలో, మంత్రి కెటీఆర్ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరగడ మే కాకుండా ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారని, భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరం పెట్టుబడులకు కేంద్రంగా మారి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ అత్యుత్తమ నగరాల సరసన నిలబడటం ఖాయమని, ఇప్పటికే హైదరాబాద్ నగరానికి మంత్రి కెటీఆర్ కృషితో అంతర్జా తీయ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టాయని, ఇక ముందు కూడా హైదరాబాద్ నగరంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్‌టిపి ప్లాంట్‌లు, రోడ్లు, అండర్ పాస్ బ్రిడ్జ్‌లు, ఫ్లయ్ ఓవర్ నిర్మాణాలతో అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ నగరం అత్యంత సౌకర్యవంతంగా రూపొందుతున్నదని కూకట్ పల్లి నియోజక వర్గంలో కూడా అభివృద్ధికి మరి కొన్ని మౌళిక వసతులకు నిధులను కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణా రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గ కార్పోరేటర్‌లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News