Saturday, April 27, 2024

నీటి రాజకీయాలు తగదు

- Advertisement -
- Advertisement -

పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం
మనోసారి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ
ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

CM Jagan comments on Krishna water issue

మనతెలంగాణ/హైదరాబాద్: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎపిలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎపి సిఎం మాట్లాడుతూ ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సిఎం జగన్ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సిఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపి, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపియని సిఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సిఎం జగన్ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

ఒప్పందాలు జరిగాయి

సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని, జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నీటి కేటాయింపుపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఎపికి 811 టిఎంసిలు కేటాయించారని గుర్తు చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థం 885 అడుగులని 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని వివరించారు. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ మరోసారి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి సామర్థం పెంచి చేపడుతోందని ఆరోపించారు. 796 అడుగుల్లోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్నారు.

సీమ పరిస్థితిని గమనించండి

ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనించండి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందకు రావాలంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందకు రాని పరిస్థితి. పక్క రాష్ట్రంలో పాలమూరు- రంగారెడ్డి తీసుకున్నా… డిండి ప్రాజెక్టు తీసుకున్నా కల్వకుర్తి కెపాసిటీ పెంచి వాడుకుంటున్న పరిస్థితిని చూసుకుంటున్నా అన్ని కూడా 800 అడుగులలోపే. నీళ్లు వాడుకునే వెలుసుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరోవైపు 796 అడుగుల వద్ద తెలంగాణ రాష్ట్రం కరెంట్ జనరేట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 800 అడుగులలోపే మీకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటే తప్పులేనప్పుడు 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కన్పిస్తున్నప్పుడు అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయించిన నీళ్లను మేము వాడుకుంటే తప్పేముంది. రైతు ఎక్కడున్న రైతేలేనని, నీళ్లు అందరికీ అవసరమన్నారు.

కేంద్ర జలశక్తి శాఖకు లేఖ

తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని, కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు ఎపి జలవనరులశాఖ కార్యదర్శి ప్రభుత్వం ఆదేశం మేరకు గురువానం నాడు మరో లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులతో ఎపికి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. 8 ప్రాజెక్టులతో 183 టిఎంసిలు వాడేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే కృష్ణా నీటిని వినియోగిస్తున్నట్టు ఫిర్యాదు చేసిన ఆయన కృష్ణాపై తెలంగాణ అన్యాయంగా చేపట్టే ప్రాజెక్టులను నిలువరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News