Monday, April 29, 2024

కృష్ణానదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్‌లో విచారణ ప్రారభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాన దీజలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశంపై బుధవారం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీజలాల పంపకాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతూ అందుకు సంబంధించిన బాధ్యతలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల ఆరున కేంద్రం ఇచ్చిననోటిఫికేషన్‌లోని గైడ్‌లైన్స్ మేరకు ట్రిబ్యనల్ విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ రామ్‌మోమన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర ఈ కేసు విచారణను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అందులోని మార్గదర్శకాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సి వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపు సీనియర్ న్యాయవాది జయదీప్‌గుప్తా ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. అధ్యయనం కోసం తగిన సమయం కావాలని ట్రిబ్యునల్‌ను అభ్యర్ధించారు. ఈ దశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపు సీనియర్ న్యాయవాది సి.ఎస్ వైద్యనాధన్ ఏపి న్యాయవాది అభ్యర్ధనలను అడ్డుకున్నారు.

ఇప్పటికే కృష్ణానదీజలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానదీజలాల్లో కేటాయించిన 811టిఎంసీల్లో కూడా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాల మధ్యతాత్కాలికంగా జరిగిన ఆడ్‌హక్ ఒప్పందాన్ని ఆంధ్రప్రభుత్వం కావాలనే ఏళ్లతరబడి పొడిగిస్తూ వస్తోందని తెలిపారు. ఇప్పటికే ఏపి కావాలని చేస్తున్న జాప్యం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, అందువల్ల కృష్ణానదీజలాల పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ఈ దశలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ణప్తి మేరకు కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా నవంబర్ 15లోపు అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరిగి ఈ కేసు విచారణ నవంబర్ 22,23 తేదిల్లో చేపట్టనున్నట్టు ట్రిబ్యునల్ వెల్లడించింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపి
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీనీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టునులో పిటీషన్ దాఖలు చేసింది. ఏపి పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అంతే కాకుండా కేంద్ర జలశక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన నేపధ్యంలో ఏపి ప్రయోజనాలను పరిరక్షించాలని కోరూతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News