Home ఖమ్మం రైతును రాజు చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం: పువ్వాడ

రైతును రాజు చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం: పువ్వాడ

CM KCR aim is farmer will be king

 

ఖమ్మం: ప్రభుత్వానికి మద్దతుగా మంచుకొండ గ్రామ రైతులు తీర్మానం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా సమగ్ర పంటల విధానాన్ని అమలు చేస్తామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు. రైతును రాజు చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.