Monday, May 6, 2024

ఘనంగా బర్త్‌డే వేడుకలు

- Advertisement -
- Advertisement -

CM-KCR

మనతెలంగాణ/హైదరాబాద్: 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవవేడుకలను పండుగలా నిర్వహించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి, నియోజకవర్గాలవారిగా మానవ హారాలు ఏర్పాటుచేసి సిఎం కెసిఆర్‌పై అభిమానం చాటికోవడంతో పాటు ఎక్కడికక్కడ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పాఠశాలు, కళాశాల విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ఎక్కడికక్కడ సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌లను కట్‌చేసి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామసీమల నుంచి పట్టణాలవరకు ఎక్కడికక్కడ జన్మదిన వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారులు కళాప్రదర్శనలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధిపై ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయకళల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వృత్తికళాకారులు తమవృత్తులకు సంబంధించిన సేవలను ఉచితంగా చేసేందుకు ముందుకువస్తున్నారు. సిఎం కెసిఆర్ ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామస్థాయినుంచి రాష్ట్రాస్థాయివరకు సిఎం కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో 60 లక్షల టిఆర్‌ఎస్ శ్రేణులు నిమగ్నమయ్యారని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. ప్రజలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతి నిధులందరూ మొక్కలునాటే కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు.

CM KCR birth day on Feb 17th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News