Saturday, April 27, 2024

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

CM KCR criticize Modi government

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే కిషన్‌రెడ్డి గోయల్ నోరు తెరవాలి

140కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే కేంద్రం చిల్లరకొట్టు షావుకారులా వ్యవహరిస్తోంది
లాభనష్టాలు భేరీజు వేసుకుంటోంది
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత
నుంచి తప్పుకుంటోంది గత యాసంగి ధాన్యాన్నే రాష్ట్రం నుంచి పూర్తిగా ఇంకా కొనుగోలు చేయలేదు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మెడమీద కత్తిపెట్టి రాష్ట్రం చేత రాయించుకుంది వద్దంటే వినకుండా సాగు చట్టాలు చేసి 700మంది రైతులను బలి తీసుకున్నారు బిజెపి హంతకుల పార్టీ సాగు రంగాన్ని అంబానీ, అదానీ చేతుల్లో పెట్టాలని చూశారు రైతుల ఉద్యమం, యుపి ఎన్నికలు చూసి రద్దు చట్టాలను రద్దు చేశారు
ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు రైతుల జీవితాలతో చెలగాటమాడుతారా? కిషన్‌రెడ్డి ఒక చేతికాని దద్దమ్మ ఆకలి సూచీలో దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే ఆధ్వానం : మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ సర్కార్‌పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిప్పులు కురిపించారు. ఇన్నేళ్ల చరిత్రలో ఇంతటి నీచమైన, దరిద్రమైన కేంద్ర ప్రభుత్వన్నీ తాను చూడలేదని ధ్వజమెత్తారు. 140 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రం చిల్లరకొట్టు షావుకారులాగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కేంద్రం లాభ నష్టాలతో బేరీజు వేసుకుంటోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. దేశ ప్రజలకు ఆహర భద్రత కల్పించాలని బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. కానీ కేంద్రం తన సామాజిక బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.

కేంద్రంలో ఒక అసమర్ధ ప్రభుత్వం… చేతకాని ప్రభుత్వం… నిర్వహణ చేతకాని ప్రభుత్వం కొనసాగుతుండడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేసిన కారణంగా యాసంగిలో ఇకపై రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సైంటిఫిక్‌గా గోదామాలు లేవన్నారు. ఆ టెక్నాలిజీ కేవలం ఎఫ్‌సిఐ వద్దనే ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యాన్ని కోనుగోలు చేయాలని కేంద్రం చుట్టూ పదిహేను సార్లు అధికారులు…ఆరు సార్లు మంత్రులు వెళ్ళారన్నారు. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.

సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ, గత యాసంగి ధాన్యాన్నే కేంద్రం ఇప్పటి వరకు పూర్తిగా తీసుకోలేదన్నారు. గత యాసంగిలో రాష్ట్రం సేకరించిన ధాన్యానికి కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రంతో కేంద్రం లేఖ రాయించుకున్నదన్నారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగి పంట బాయిల్డ్ రైస్‌కే అనుకూలమన్నారు. బాయిల్డ్ రైస్‌ను గతంలో ఎఫ్‌సిఐ ప్రోత్సహించిందన్నారు. కొత్త రాష్టమైనా కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఎపి ఎన్నో ఇబ్బందులు పెట్టినా, సాగునీటి ప్రాజెక్టులపై కొందరు కేసులు వేసినా ధైన్యంగా వాటిని నిర్మించామన్నారు. . తమ ప్రభుత్వం కృషి వల్లే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందన్నారు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన…. తమ హయాంలో 69.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు.

మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారా?

సాగురంగాన్ని మొత్తం కేంద్రం అంబానీ, అదానీ చేతిలో పెట్టాలని చూసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు వాస్తవం గ్రహించిన ఉత్తరాది రైతులు ఉద్యమానికి దిగారని రైతుల పోరాటం, యూపీ ఎన్నికలు చూసి సాగు చట్టాలు రద్దు చేశారని పేర్కొన్నారు. వద్దంటే వినకుండా సాగుచట్టాలు చేసి 700 మంది రైతులను చంపారని ఆరోపించారు. తాను వెళ్ళా…మంత్రులు…అధికారులు వస్తే…ఎందుకు వచ్చారు? అని కేంద్రమంత్రులుఅడుగుతారా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దాన్యం కొనగోళ్ల విషయంలో కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. ధాన్యం ఉత్పత్తిపై శాటిలెట్ చూపించడం కాదు…మీ (కేంద్రం) మొదడు లేదని వ్యంగ్యస్త్రాలను సందించారు. కేంద్రం ఇంత తెలివ తక్కువగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఏ వ్యవహారం ఇదని నిలదీశారు. రైతుల జీవితాలను చెలగాటం ఆడుతారా? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే తీరు ఇదేనా? చాలా నిజంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతులు వందశాతం ముంచుతారన్నారు.

చిల్లరకొట్టు షావుకారిగా వ్యవహరిస్తోంది

కేంద్రం చిల్లర కొట్టు షావుకారిగా వ్యవహరిస్తోందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అనేక రంగాలలో కేంద్రం తన సామాజిక భాద్యతను విస్మరిస్తోందన్నారు. ప్రధానంగా దేశానికే అన్నం పెట్టే రైతుల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహిస్తోందని మండిపడ్డారు. రైతులు పండిండిన కొనుగోలు చేయడానినికి కేంద్రం నిరాకరించడం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై అనవసర రాద్దాంతం….. గందళగోళం సృష్టిస్తోందన్నారు. వాస్తవానికి ఇది చిన్న విషయమన్నారు. చాలా సులభమైన సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల బడ్జెట్ గల భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రం చిల్లర, మల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. కేంద్రానికి ఒక సామాజిక బాధ్యత ఉండాలన్నారు. దేశ ఆహార భధ్రత కేంద్రానిదేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఏ కారణంచేతనైనా దేశంలో ధాన్యం నిల్వలు పెరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం అంటే చిల్లరకొట్టు కాదు కదా? అని అన్నారు. కానీ కేంద్రం దిక్కుమాలి తనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తన చేతకాని తనాన్ని రాష్ట్రాలపై నెట్టివేస్తోందని సిఎం కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఇంతనీచమైన రాజకీయం ఇప్పటి వరకు చూడలేదు… విషయత్తులోనూ చూడమన్నారు. ఇదే పద్దతి…ఇదేం బుల్‌బుల్ రాజకీయం అని నిలదీశారు. దాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ చేశామన్నారు. యాసంగిలో ఇచ్చిన టార్గెట్‌ను కేంద్రం ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు. ఈ ధాన్యాన్ని ఎఫ్‌సిఐ కొంటామని చెప్పిందన్నారు. దీనిపై ఎఫ్‌సిఐ నుంచి ఒక లేక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా కేంద్ర మంత్రికి చూపించానన్నారు. కానీ రాష్ట్రం మెడపై కత్తిపెట్టి…భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ఇవ్వమని చెబితే తీసుకుంటామని చెప్పిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం భారం రాష్ట్రంపై పడడం వల్లే విధిలేని పరిస్థితుల్లో కేంద్రానికి రాసి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కనీసం ఇప్పటికైనా సంవత్సరం కోటా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పమని అడిగితే దానిపై కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పష్టం ఇవ్వలేదన్నారు.వర్షాకలంలో 40 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యం కొంటే…రైతులు 60 లక్షల మెట్రిక్ టన్నులు పండించారన్నారు. వర్షాకాలంలో పండించిన పంటకే దిక్కులేకుండా పోయిందని, ఇక యాసంగి పంటలపై పూర్తి ఆశ చచ్చిపోయిందన్నారు. ఖచ్చితంగా35 డిగ్రిల ఎండ ఉండాలని చెప్పడం…ఢిల్లీ లంగనాటకాలకు నిదర్శమన్నారు. కేంద్రం చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సతాయించి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇప్పుడు ఒక గింజ కూడా తీసుకునేది లేదని ఖరాఖండిగా చెబుతోందన్నారు. అంటే రాష్ట్రంలోని రైతులను కేంద్రం ఏం చేయాలని అనుకుంటున్నదని ప్రశ్నించారు.

ఎన్నో అడ్డంకులను అధిగించి… అద్భుతైమైన ప్రగతిని సాధిస్తున్నాం

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పడు తెలంగాణలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. విభజన సమస్యలను కూడా సర్దుకున్నామన్నారు. ఎపి సతాయించినా…వందల కొద్ది కేసులు ఎదుర్కొని ప్రాజెక్టులను నిర్మించామన్నారు. రాష్ట్ర రైతంగానికి 24 గంటల కరరెంటు ఇచ్చామన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. రైతులు అద్భుతంగా ప్రొత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే రైతుబంధు…రైతుభీమా వంటి వాటిని తీసుకొచ్చామన్నారు. ఈ దేశంలో నీటితీరువా చార్జీలు లేకుండా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. కాలువలు, చెరువల ద్వారా నీటిని ఇస్తే ఇతర రాష్ట్రాలు పన్నులు వసూలు చేస్తున్నయన్నారు. కానీ రాష్ట్రంలో ఎలాంటి పన్నులు లేని కారణంగానే రాష్ట్రంలో బ్రహ్మాండమైన వ్యవసాయం జరుగుతోందన్నారు.

గణనీయంగా పంటల ఉత్పత్తి సాగుతోందన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణలో వరి పంట ఉత్పత్తి 49.27 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే కేవలం ఏడేళ్లలోనే ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య లేదు …నీటి సమస్య లేదన్నారు. అందుకనే రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. తెలంగాణ వస్తే భూములు పడిపోతాయన్నారు? మరి తగ్గియా అని ప్రశ్నించారు. ఎవరూ ఊహించని విధంగా భూముల ధరలు పెరిగాయన్నారు. రైతులు కోటీశ్వరులు అయ్యారన్నారు. ఏడేళ్ళ కిందట రైతులు హైదరాబాద్‌లో కూలీలుగా ఉండేవారన్నారు. ఇప్పుడు కోటీశ్వరులుగా జీవిస్తున్నారన్నారు. ఇక్కడి రైతులు ఎపితో పాటుఇతర రాష్ట్రాల్లో భూములు పెద్దసంఖ్యలో కొనుగోలు చేస్తున్నరన్నారు. ఒక చిన్న గ్రామంలోని బ్యాంకులోనే సుమారు రూ. 6 కోట్ల నగదు ఉన్నదంటేనే…. వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చునని అన్నారు.

పండించిన ధ్యాన్యాన్ని కొనుగోలు చేసే తెలివితేటలు కేంద్రానికి లేవు

పండించిన ధాన్యాన్ని కొనుగుల చేసే తెలివితేటలు కేంద్రం వద్ద లేకపోవడం సిగ్గుచేటని సిఎం కెసిఆర్ విమర్శించారు. పైగా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతన్నారన్నారు. ఈ నిర్వహణ కేంద్రానికి రాని కారణంగానే పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు నిలదీస్తున్నారన్నారు. ఎంపిలు నిలదీసినా కేంద్రం నుంచి తగు సమాధానం రావడం లేదన్నారు.

కిషన్‌రెడ్డి ఒక చేతకాని దద్దమ్మ

తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అని అన్నారు. దీనిపై రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిత్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మొత్తం కొనిపిస్తా అంటే ….కిషన్ రెడ్డి సిపాయి అని అన్నారు. అలా కాకుండా కేంద్రం కొనుగోలు చేయదు…అనే చెప్పే మంత్రి తెలంగాణ నుంచి కావాలా? అని మండిపడ్డారు. చేతకాని దద్దమ్మ… ఏం మాట్లాడుతున్నాడే ఆయనకు అర్ధం అవుతుందా? కెసిఆర్ తీవ్ర పదజాలంతో నిప్పులు కురిపించారు. కేంద్రంలోని పార్టీలకు పాలన చేతకాదు.. వారి చేతకాని తానాన్ని మందిమీద రుద్దుతారా? అని ప్రశ్నించారు. దిక్కుమాలిన చట్టాలు తీసుకొచ్చి ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని రైతులు క్షమాపణలు చెప్పారన్నారు. పైగా నాసిరకం ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో పిడి యాక్ట్ తీసుకొచ్చిందే తెలంగాణ ప్రభుత్వమన్నారు.

బిజెపి పాలించిన రాష్ట్రాల కంటే కోటి రెట్లు మంచి పాలన అందిస్తున్నామన్నారు. ఆహార బాధ్య తీసుకోరు…రైతుల సంక్షేమం పట్టించుకోరు…ఉల్టా మీరే మాట్లాడుతారా? అని నిలదీశారు. కేందాన్ని ఒప్పింతే దమ్ము, తెలివిలేక కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమాటలు… తలాతోక లేకుండా మాట్లాడ వద్దని సూచించారు. రైతులు పండింటిన పంటలను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. ఏదైనా ఉంటే సాహసంగా మాట్లాడాలన్నారు. గతంలో ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగా అని చెప్పానని…ఆ మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తే…అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి గులాబీ కుండవా కుప్పుకుంటానని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. అబద్దాలు చెప్పే ఖర్మ తమకు లేదన్నారు.

బిజెపి హంతకుల పార్టీ

నల్ల చట్టాలతో దేశంలోని 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బిజెపి అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అదొక హంతుకల పార్టీ అని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులపై కార్లు ఎక్కించి…. తొక్కించి చంపారన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఎవరూ పూర్తి చేశారో బిజెపి నాయకులు తెలుసుకోవాలన్నారు. ఈ విషయం తెలిసి కూడా చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. డీజిల్,గ్యాస్ రెట్లు పెంచింది ఎవరు? క్రూడాయిల్ ధరలు తగ్గినా…పెట్రోలియం ఉత్పత్తి ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. పైగా వాటిపై వ్యాట్ ధరలు తగ్గించాలని బిజెపి నాయకులు ధర్నాలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికేమైనా సిగ్గుందా? అని నిలదీశారు. వీళ్ళు ముంచేటోళ్లు..తప్ప మంచి చేసేటేళ్లు కాదన్నారు. రాష్ట్రంలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కూడా 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసిందన్నారు. కానీ బిజెపి నాయకులు మార్కెట్ల వద్దకు పోయి రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బుల్‌బుల్….మోసకారి ప్రభుత్వమన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయలది దరిద్ర రాజకీయమని ఆయన ఘాటుగా విమర్శించారు.

ఆకలి సూచికలో పాకిస్థాన్ కంటే అధ్వానం

ప్రపంచ ఆకలి సూచీలోభారత్ 101వ స్థానంలో ఉందని.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే హీన స్థితిలో ఉన్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజలకు ఆహారం లేక చస్తుంటే నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారన్నారు. నిల్వలు ఎక్కువుంటే దేశ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మోడీ హయాంలో ఆకలిచావులు పెరిగాయని సర్వేలు చెప్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గోయల్‌కు సిగ్గు…లజ్జా ఉంటే కళ్ళు తెరవాలన్నారు. ఇందులో పాకిస్థాన్ ర్యాంకు 92 ఉంటే మనం దానికంటే వెనుకబడి ఉన్నామన్నారు. ఇది మన బతుకు అని మండిపడ్డారు. కేంద్రానికి నిజంగా సామాజిక బాధ్యత ఉంటే ఉచితంగా బియ్యం పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. 2016 ఇండియా స్థానం 96 ఉంటే ఇప్పుడు 101 స్థానం రావడం బిజెపి అసమర్ధ పాలనకు నిదర్శమన్నారు. . ఉత్తర భారతీయులు చెప్పిన విధంగా రాష్ట్ర రైతులకు కూడా కేంద్రం క్షమాపణలు చెప్పాలన్నారు.

బిజెపిపాలనలో దేశంలో ఆకలి కేకలు ఎక్కువయ్యాయన్నారు. పైగా తన అసమర్థను కప్పిపుచ్చుకునేందుకు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. మధ్యతరగతి ప్రజలు ఉసురు పోసుకుంటారన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతే కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించేందుకు యత్నిస్తోందన్నారు. రాష్ట్ర రైతులకు 24 గంటల కరెంటును ఇవ్వడం కూడా నాశనం చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో అద్భుతమైనఐటి రంగం వచ్చిందన్నారు. పెద్దసంఖ్యలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఇండియా టుడే మ్యాక్సిన్ కూడా వెల్లడించిందన్నారు. అలాంటి తెలంగాణలో మతకల్లోలు సృష్టించడానికి బిజెపి యత్నిస్తోందని ఆరోపించారు. దీనిపై మేధావులు ఆలోచించాలన్నారు.దేశ ఆర్ధిక విధానాన్ని కేంద్రం పూర్తిగా నాశం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై వందకు వందశాతం ఫైట్ చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఓడిపోతామనే వ్యవసాయ చట్టాలు రద్దు చేశారన్నారు. ఈ దేశం బాగుపడాలంటే… దేశం నుండి బిజెపిని పారదోలాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News