Saturday, May 4, 2024

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

CM KCR

 

దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి

సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి

అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి

నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు

కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల వద్ద అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర ఉండాలి

అన్ని పట్టణాల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు

సివిల్ సర్వీస్ అధికారులు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి : సిఎం

హైదరాబాద్ : సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మంచి ఆలోచనా విధానంతో పాటు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఎఎస్ అధికారులే రేపు రాష్ట్రానికి కార్యదర్శులు గా, శాఖాధిపతులుగా, వివిధ హోదాల్లో పనిచేస్తారన్నా రు. కాబట్టి విషయ పరిజ్ఞానం పెంచుకోవడం వారికి, రా ష్ట్రానికి కూడా మంచిదన్నారు. భోజనానంతరం ప్రగతిభవన్‌లో మంగళవారం నాడు జిల్లాకలెక్టర్లతో జరిగిన భేటీల్లోఅధికారులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఇతర దేశాల్లో అమలవుతున్న మంచి విధానాలను తెలుసుకునేందుకు ఆయా దేశాల పర్యటనలు చేయాలన్నారు. అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను అధ్యయ నం చేసి, తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయ తీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా గ్రామాలు, పట్టణాల పాలనలో కలెక్టర్ల బాధ్యత మరింత పెరిగిందన్నా రు.

కలెక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనను క్రమబద్ధం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్ లెస్ సెట్లు సమకూర్చాలని ప్రభుత్వ ం నిర్ణయించిందని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుందన్నారు. భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలని, ఖచ్చితంగా సంస్కరణలు రావాలన్నారు. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదన్నారు. ఈ నేపథ్యంలో మిగతా 5 శాతం సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం కొత్తగా నియమించిన అడిషనల్ కలెక్టర్లు తమకు అప్పగించిన శాఖల బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలన్నారు. స్థానిక సంస్థల వ్యవహారాలు చూసే అడిషనల్ కలెక్టర్ల కంప్యూటర్లో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సంపూర్ణ వివరాలుండాలి.

గ్రామాల్లో, పట్టణాల్లో చార్డట్ అమౌంటు (విధిగా చేయాల్సిన ఖర్చు)ను అడిషనల్ కలెక్టర్లు ని ర్ధారించాలన్నారు. కరెంటు చార్జీల చెల్లింపు, జీతభత్యా లు, అప్పుల కిస్తీలు తదితర వ్యయం చార్టడ్ అమౌంట్ కిం దికి వస్తాయని సిఎం తెలిపారు. డిపిఒ, డిఎల్‌పిఒ, ఎం పిఒ, గ్రామ కార్యదర్శులతో అడిషనల్ కలెక్టర్లు నిత్యం స మావేశమవుతు, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. -అడిషనల్ కలెక్టర్లందరికీ రెండు రోజుల పాటు ‘గ్రామీణాభివృద్ధి, పట్టణాభివద్ధి’పై శిక్షణ తరగతులు నిర్వహించాలని సిఎం సూచించారు. ఈ తరగతులకు కలెక్టర్లను కూడా ఆహ్వానించాలన్నారు. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు ముఖ్యంగా మ హిళలు టాయిలెట్లు లేక చెప్పరాని అవస్థలు పడుతున్నారన్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశరు. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలన్నారు.

ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని సిఎం కెసిఆర్ సూచించారు. – అనంతరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం సహా వివిధఅంశాలపై సీనియర్ అధికారులు, కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పారు. అలాగే వివిధ అంశాలపై చర్చ జరిగింది. పిసిసిఎఫ్ శోభ తెలంగాణకు హరితహారం, అడవుల పునరుద్ధరణపై మాట్లాడారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ కొత్త మున్సిపల్ చట్టంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సూచనలు చేశారు. పలు విషయాలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

ఇవి తప్పనిసరి

పట్టణాల్లో వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి.
మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 3 చొప్పున, పట్టణాల్లో కనీసం ఒకటి చొప్పున నిర్మించాలి.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యుసి) పంపడం ప్రాధాన్యతాంశంగా కలెక్టర్లు గుర్తించాలి.
జిల్లాల వారీగా ఫారెస్టు బ్లాకులను గుర్తించి, అడవుల పునరుద్ధరణ, రక్షణకు చర్యలు తీసుకోవాలి.
అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలి. అవకాశం ఉన్న ప్రతి చోటా మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చే యాలి. చెట్లు పెంచడం, అడవులను పునరుద్ధరించ డం లాంటి గ్రీన్‌ప్లాన్ అమలుకు నిధుల కొరత రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వినియోగించుకోవాలి.

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను పరిష్కరించాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. ఇందుకోసం ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటుం ది. తానే (సిఎం) స్వయంగా ఆయా జిల్లాల్లో పర్యటించి, పోడు భూముల సమస్యకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటాం.

పట్టణ ప్రగతి కార్యక్రమానికి పట్టణాల్లోని వార్డు ను యూనిట్ గా చూడాలి. ఆ వార్డులోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నియమించే ప్రజా కమిటీలోని సభ్యులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డుల వారీగా సమస్య లు గుర్తించాలి. మొత్తం పట్టణాని కి సంబంధించిన సమస్యలు గుర్తించాలి. ప్రత్యామ్నా యం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్ పాత్ లపై వ్యాపారం చేసుకునే వారిని బలవంతంగా తరలించవద్దు.

CM KCR Directions for Collectors and Additional Collectors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News