Monday, April 29, 2024

ఢిల్లీ కోట బద్దలు కొడతాం

- Advertisement -
- Advertisement -

 

CM KCR fires on Modi in Jangaon tour

బిడ్డా… ఇది తెలంగాణ గడ్డ 

పులి బిడ్డతో తమషానా.. బీ కేర్‌ఫుల్

ఖబడ్దార్ మోడీ… నీవు ఉడత ఊపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడన్నుది తెలంగాణ పులిబిడ్డ

జనగామ జనసంద్రంలో గర్జించిన కెసిఆర్

సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను
సాధించుకున్నాం మీరందరూ దీవించి పంపిస్తే ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు
సిద్ధం టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే కేంద్రం వ్యవసాయ ఖర్చులు
పెంచుతోంది నా ప్రాణం పోయినా సరే మోడీ చెప్పినట్టు వ్యవసాయ
మోటార్లకు మీటర్లు పెట్టనివ్వను అవసరమైతే కేంద్రంపై తిరగబడదాం
రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు మెడికల్ కళాశాల ఇవ్వరు
ఇవ్వకున్నా పర్లేదు, అనవసరంగా మమ్ముల్ని కెలకవద్దు మా డిమాండ్లు నెరవేర్చే వారినే కేంద్రంలో తెచ్చుకుంటాం బిజెపి వాళ్లను మేమేమి అనం మమ్మల్ని టచ్ చేస్తే మాత్రం వారిని నాశనం చేస్తాం పిడికెడు లేని బిజెపి నేతలు ఎగిరెగిరి పడుతుంటే ఊరుకుంటామా? రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం
ఎక్కడాలేనివిధంగా 30లక్షల బోర్లు వేసుకున్నాం కేంద్రం అడ్డగోలుగా డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసింది ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతోంది చంద్రబాబు కూడా ఇదే మాట అని అలా వెళ్లిపోయాడు : జనగామ భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కెసిఆర్

“ నాడు జనగామ ప్రజల వెతలు చూసి జయశంకర్ సార్‌కు, నాకు ఏడుపు వచ్చింది. అప్పట్లో బచ్చన్నపేటలో సభ పెడితే ఒక్క యువకుడు కనిపించలేదు. నాటి సభలో అంతా వృద్ధులే. యువకులు వలస వెళ్లారని చెబితే కన్నీళ్లొచ్చాయి. రాష్ట్రం ఏర్పడ్డాక బచ్చన్నపేట బతుకులు మారాయి. ఇప్పుడు ఇళ్లకే మంచినీళ్లు వస్తున్నాయి. గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగేందుకు రంగం సిద్ధమైంది.”

“ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నాం. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తాం. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందిస్తాం. రాష్ట్రంలో ఎస్‌సిల బాధలు పోవాలి.”
“ రైతులు పండించే ధాన్యం కొనరు.. కరెంటు మీటర్లు మాత్రం పెట్టాలా? లేదంటే దాడులు చేస్తారా? ఇదేనా కేంద్రం దందా!”

మన తెలంగాణ/హైదరాబాద్ : ఖబర్దార్ మోడీ! నీ ఉడుత ఊపులకు ఎవరు భయపడరు… ఇక్కడున్నది తెలంగాణ పులి బిడ్డా… అంటూ జనగామ వేదికగా కేంద్రంలోని బిజెపి సర్కార్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోడీ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆయన చెలరేగిపోయారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ… దేశం నుంచి నిన్ను(మోడీని) తరిమేసే రోజులు త్వరలోనే రానున్నాయని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నీ కోటను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన ఉద్దేశాన్ని కేంద్రానికి నేరుగా సిఎం కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించామని, మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమన్నారు. బిజెపి పిట్ట బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. శుక్రవారం జనగామలోని యశ్వంతపూర్‌లో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో తూర్పారపట్టారు. ఘాటైన పంచ్‌లతో కేంద్రాన్ని పూర్తిగా కడిగిపారేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే.. కేంద్రం వ్యవసాయ పెట్టుబడి ధరలు పెంచుతోందని మండిపడ్డారు.

తన ప్రాణం పోయినా సరే… కేంద్రం చెప్పిన విధంగా రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు, బావులకు మీటర్లు పెట్టనివ్వమన్నారు. అవసరమైతే కేంద్రంపై తిరగబడతామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, మెడికల్ కళాశాల ఇవ్వరు…. అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా పర్లేదు.. కానీ అనవసరంగా తమను కెలకవద్దన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా, మెడికల్ కళాశాలలు, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేవాళ్లనే కేంద్రంలోని తెచ్చుకుంటామన్నారు. బిజెపి వాళ్లను మాకు మేమ్‌గా టచ్ చేయం.. మమ్మల్ని టచ్ చేస్తే మాత్రం నశం చేస్తామన్నారు. పిడికెడు లేని బిజెపి నేతలు తమపై ఎగిరెగిరి పడుతుంటే తాము చూస్తూ ఉరుకుంటామా? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ శక్తి ముందు మీరు అడ్రస్ కూడా ఉండరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల బోర్లు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం అడ్డగోలుగా డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసిందని పేర్కొంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు

తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామని కెసిఆర్ హెచ్చరించారు. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. జనగామ టౌన్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలను బిజెపి వాళ్లు కొట్టారన్నారు. టిఆర్‌ఎస్ కార్యకర్తల బలం ముందు… మీరెంత? అని మండిపడ్డారు. మేం గట్టిగా ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారన్నారు. రా ష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశామన్నారు. అందువల్ల మీ జాగ్రత్తలా మీరు ఉండండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారన్నారు. ప్రతి మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు. కానీ తనను చంపినా రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా గతంలో మీటర్లు పెట్టమన్నాడు.. అలా చెప్పే వెళ్లిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

ప్రాణం పోయినా మీటర్లు పెట్టం

కరెంట్ సంస్కరణల పేరుతో రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పంచాయతీ పెట్టాలని చూస్తున్నారని సిఎం కెసిఆర్ విమర్శించారు. తన ప్రాణం పోయినా సరే వ్యవసాయ బోర్లకు, బావులకు మీటర్లు పెట్టమన్నారు. విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్రం ఎన్ని నిబంధనలు పెట్టినా వాటిని అమలు చేయబోమని ఆయనతెగేసి చెప్పారు. ఈ ప్రయత్నాలను తాను అన్ని విధాలుగా అడ్డుకుంటామన్నారు. టిఆర్‌ఎస్ పోరాటం చేసిన పార్టీ అని, యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రానికి ఉండాలని కేంద్రాన్ని పలుమార్లు కోరానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండు మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించే ధాన్యం కొనరు.. కరెంటు మీటర్లు మాత్రం పెట్టాలా? అని ప్రశ్నించారు. లేదంటే దా డులు చేస్తారా? ఇదేనా కేంద్రం దందా? అని నిలదీశారు. ఇప్పుడిప్పుడే రా ష్ట్రం అన్ని విధాలుగా గాడిన పడుతోందన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ అన్నివర్గాలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్నామన్నారు. బ్యాంకులను మోసగించి, కోట్లాది రూపాయల కుంభకోణాలు చేసిన వారిని వదిలేసి పేదలు, రైతుల వెంటే మోడీ ప్రభుత్వం పడుతోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర సాయం గుండు సున్నా

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నామన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ఎదిగామన్నారు. దేశంలో అనేక రాష్ట్రా ల కంటే తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో ముందుందని చెప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా కేంద్రంతో గొడవ పెట్టుకోలేదని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు.

వెతలు చూసి ఏడ్చినా..

నాడు జనగామ ప్రజల వెతలు చూసి జయశంకర్ సార్, తాను ఏడ్చినట్లు సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బచ్చన్నపేటలో సభ పెడితే ఒక్క యువకుడు కనిపించలేదన్నారు. నాటి సభలో అంతా వృద్ధులే కనిపించారన్నారు. బచ్చన్నపేట యువకులు వలస వెళ్లారని చెబితే కన్నీళ్లొచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక బచ్చన్నపేట బతుకులు మారాయన్నారు. ఇప్పుడు ఇళ్లకే మంచినీళ్లు వస్తున్నాయన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇప్పుడు మంచినీళ్ల బాధ, విద్యుత్ బాధ కూడా పోయిందన్నారు. గతంలో బచ్చన్నపేటను చూస్తే బాధనిపించేది. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి దళిత కుటుంబానికి చేయూతగా దళితబంధు తెచ్చాం. జనగామ ఒకప్పుడు కరువు సీమగా ఉండేది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చా క అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.

40 వేల కుటుంబాలకు దళితబంధు

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందించనున్నట్లు తెలిపారు. ఎస్‌సిలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే మెడికల్, ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు తెచ్చామని వివరించారు.

ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి

ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయన్నారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 తెలంగాణలోని గ్రామాలే అని గుర్తు చేశారు. పట్టుదలతో పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు.

భూముల ధరలకు రెక్కలు

తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతుంది. హైదరాబాద్ లో రూ. 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. ఢిల్లీ ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో కొంటున్నారు. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో జనగామలో భూముల విలువలు పెరిగాయన్నరు. ఏడేళ్ల కింద రూ. రెండు లక్షల విలువ న్న ఎకర భూమి.. ఇప్పుడు రూ.3 కోట్లకు చేరిందన్నారు. మారుమూల ప్రాం తాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదన్నారు. ఇదం తా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

జిల్లాకు వరాల జల్లు

జనగామ జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఘనపురం, పాలకుర్తిలలో డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తామన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను మూడు రోజుల్లో జారీ చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News