Monday, April 29, 2024

వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

TS Govt to decide Celebrate Azadi ka Amrut Mahotsav

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స తీసుకుంటున్న వారు భారీగా ఉన్నారని అన్నారని, అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. వేసవి కాలం కావడం వల్ల రోగులు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో భారీగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

గాంధీ, టిమ్స్ వంటి రోగులు ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరగడంతో కరోనా పరీక్షలకు వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. యుద్ధ విమానాల ద్వారా తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రికి అందే విధంగా సమన్వయం చేసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఐసోలేషన్ కిట్స్ అందే విధంగా చూడాలని కూడా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
ఎన్ని లక్షల మందికి అయినా హోమ్ ఐసోలేషన్ కిట్స్: మంత్రి ఈటల
ఎన్ని లక్షల మందికి అయిన హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించేందుకు వీలు కిట్స్‌ను సమకూర్చాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొలుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కరోనా కిట్స్ కొరత ఏర్పడకుండా ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా అయిర్ లిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు.

CM KCR key orders to Health Department officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News