Monday, April 29, 2024

డిప్యూటీ కలెక్టర్ సంతోషి

- Advertisement -
- Advertisement -

CM KCR lunch with Colonel Santosh Family

 

కల్నల్ సంతోష్‌బాబు భార్యకు సంబంధిత ఉత్తర్వులను అందించిన సిఎం కెసిఆర్
బంజారాహిల్స్‌లో రూ.20 కోట్ల విలువైన ఇంటి స్థలం
శిక్షణ ఇప్పించి ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు సిఎం సూచన
సంతోషి కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల భారత-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సిఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20మంది కుటుంబ సభ్యులతో కలిసి సిఎం కెసిఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపి బడుగుల లింగయ్య, శాసనసభ్యులు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

CM KCR lunch with Colonel Santosh Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News