Saturday, April 27, 2024

ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Meeting with Kejriwal tomorrow

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో భేటీ

మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో ఢిల్లీ చేరుకున్నారు. మూడు రో జుల పాటు ఆయన అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను కలిసే అవకాశముందని టిఆర్‌ఎస్ వర్గాల్లో విని పిస్తోంది. ఉదయం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మొదటగా సిఎం కెసిఆర్ కలుస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో గళం విప్పిన సిఎం కెసిఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగానే వారు బహిరంగంగానే సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రాలకు రావాల్సిందిగా కెసిఆర్‌కు పెద్దఎత్తున ఆహ్వానాలను పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవలే రాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రేను కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌తో కూడా చర్చలు జరిపారు. అంతకుముందు తమిళ నాడుకు వెళ్లి ఆ రాష్ట్ర సిఎం స్టాలిన్‌కు సిఎం కెసిఆర్ భేటి అయ్యారు. అలాగే ఫోన్‌లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సిఎం కెసిఆర్ చర్చలు జరిపారు. అంతకు హైదరాబాద్‌కు వచ్చిన వామపక్షాలకు చెందిన అగ్రనేతలతోనూ కూడా సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా జాతీయ రాజకీయాలపైన చేర్చించారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం రాజకీయ వర్గాల్లో మరోసారి ఆసక్తి నెలకొంది. పలువురితో సమావేశాలు ముగిసిన అనతంరం
ఢిల్లీ ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడ కెసిఆర్ తన ఆరోగ్యానికి సంబంధించిన పలు పరకాల టెస్టులు చేయించుకోనున్నారని సమాచారం.

కాగా సిఎం కెసిఆర్‌తో ఢిల్లీకి వెళ్లిన వారిలో ఆయన సతీమణి శోభ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వనోద్‌కుమార్, ఎంపి సంతోష్‌కుమార్, ఎంఎల్‌సి కవిత, అడిషనల్ డిజి అనిల్‌కుమార్, సిఎం పిఎలు శ్రావణ్‌రెడ్డి, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం

కేవలం దేశ రాజకీయాలపైనే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంటులపై కూడా పలువురు కేంద్ర మంత్రులతో కెసిఆర్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను కూడా మరోసారి ఆయన కేంద్రం దృష్టికి తీసుకవెళ్లే అవకాశముందని సమాచారం. అయితే ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కెసిఆర్ కలుస్తారా? లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News