Sunday, April 28, 2024

సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్ వన్: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిణతి పొందిన దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఎన్నికల్లో ఒక్కో పార్టీకి అభ్యర్థి ఉంటారు.. వారి గుణగణాలు చూడాలి. వారి వెనుకున్న పార్టీల చరిత్ర చూడాలని కోరారు. తెలంగాణ ను జబర్దస్త్ గా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంసాగర్ అన్ని కాలాల్లో నిండే ఉంటదన్నారు. నిజామాబాద్ నగరం చాలా సుందరంగా తయారైందన్న సిఎం.. 24 గంటల హై కరెంటు ఇస్తున్నాం.. అందుకే ఐటీ హబ్ లు వస్తున్నాయని చెప్పారు.

పేదల సంక్షేమంలో ఇండియాలోనే నంబర్ వన్ గా ఉన్నాం.. అన్ని రంగాలు అభివృద్ధి చెందామని తెలిపారు. గణేష్ గుప్తా పేదవాడు కాదు.. డబ్బులు ఆయనకు అవసరం లేదు.. అభివృద్ధి చేయడానికి వచ్చాడు.. గెలిపించండని కెసిఆర్ ప్రజలను కోరారు. బాబ్రీ మసీదును కూల్చి వేసింది ఎవరు..? అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్నారు. నిజామాబాద్ లో 9 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మైనారిటీలకు ఐటీ సెక్టార్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

హిందు ముస్లిం తేడా లేకుండా మనందరం కలిసి పని చేద్దాం.. ప్రేమానురాగాలతో కలిసి జీవిద్దామని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం మనకు మోసం చేసింది.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని ఆయన సూచించారు. 2024 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News