Sunday, May 12, 2024

24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం కరోనాపై ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “యావత్ ప్రపంచ క్షేమం కసం రేపు ఒక్కరోజు నియంత్రణ పాటించాలి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు స్వీయ నియంత్రణలో జనతా కర్ఫ్యూ పాటించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలువాలి.

స్వీయ నియంత్రణే మనల్ని కాపాడుతుంది. అవసరమైతే అన్నీ రద్దు చేసి మహమ్మారిని ఎదుర్కొంటాం. మనం బతికుంటేనే కదా మంచో చెడో జరిగేది. నా ప్రజలను ఆరు నూరైనా కాపాడుకుంటా. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కొన్ని వందల పిలుపులు ఇచ్చాను. మనిషికి మనిషి ఒక మీటర్ దూరం ఎడం పాటించాలి. పదేళ్ల పిల్లలు, 60 ఏళ్ల పెద్దలను రెండుమూడు వారాలు బయటకు రానియకండి. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారంతా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులే. పగలనకా రాత్రనకా శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించాలి. వైద్య సిబ్బంది క్షేమం కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెడతాం. కరీంనగర్ లో 50 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. కరీంనగర్ సేఫ్ గా ఉంది. ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు లేవు. ప్రధాని పిలుపు మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టమని చెప్పింది ఐక్యత కోసం. దేశమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి చప్పట్లు కొట్టమని ప్రధాని చెప్పారు. దేశ ప్రధాని పిలుపు మేరకు.. నేను, నా కుటుంబం కూడా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొడతాం. మీరంతా కూడా రేపు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలి. రేపు సాయంత్రం 5 గంటలకు అందరికీ వినిపించేలా ఒక సరైన్ మోగుతుంది. అప్పుడు నాలుగైదు నిమిషాల పాటు అందరూ చప్పట్లు కొట్టండి” అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Press Meet on Janata Karfu against Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News