Saturday, April 27, 2024

కాంగ్రెస్ వస్తే ఖతమే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో/బోధన్/ కర్మకాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో, రైతులను అరేబియా సముద్రంలో కలుపుతుందని బిఆర్‌ఎస్ అ ధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరా వు అన్నారు. దేశాన్ని 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తెలంగాణకు ప్రధా న శత్రువేనని అన్నారు. బుధవారం నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలతే హవా ఉంటుందని, జాతీయ పార్టీల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. అంతేకాకుండా 2024 తరువాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏక పార్టీల ఆధిపత్యం ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపిల స్థానాలు మనం గెలుచుకుంటే ఢిల్లీలో మన తడాఖా చూపెట్టవచ్చునని తెలిపారు. తెలంగాణ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి ఎం తో కృషి చేస్తున్నామన్నారు. గంగా జమునా తెహజీబ్‌గా రాష్ట్రంలో హిందూ, ముస్లింలు అందరూ సోదరుల్లాగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ పదేళ్లలో ఒక్కసారిగా కర్ఫూ, కల్లోలం గానీ లేకుండా శాంతియుత వాతావరణం మంచి పా లన అందిస్తున్నామని కెసిఆర్ అన్నారు.

బిజెపి మత పిచ్చితో ప్రజల్లో మంటలను రేపుతున్నదని అన్నారు. దేశంలో 157 మెడికల్ కళాశాలను మంజూరు చేసి న కేంద్రం తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదంటే రాష్ట్రం పట్ల బిజెపికి ఎంత వివక్ష ఉందో అర్థమవుతుందన్నారు. ఈసారి పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు పోవుడు ఖాయమన్నారు. రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జైభీమ్ అంటారన్నారు. రాష్ట్రం కాంగ్రెసోళ్ల చేతిలో పడితే వైకుంఠ ఆటలో పెద్ద పాము మింగినట్టే ప్రజల పరిస్థితి అవుతుందన్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ధరణి తీసేస్తామని, 24 గం టల కరెంటు వద్దని, రైతులకు 3 గంటల కరెంటే చాలని ఇలా నానా రకాలుగా మాట్లాడుతున్నారని 10 హెచ్‌పి మోటార్ పెట్టుకోమనే వాళ్లు రాజ్య పాలన చేస్తే రైతుల గతి ఏమవుతుందో ఆలోచన చేయాలని కెసిఆర్ కోరారు. అలాగే వ్యవసాయం గురించి ఎటువంటి అవగాహన లేని పిసిసి అధ్యక్షుడు రోజుకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని, 10 హెచ్‌సి మోటార్లు వాడాలని చెబుతున్నారని అన్నారు. పథకాలతో ప్రజల దగ్గరకు వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అ మూల్యమైన ఓటును గంగపాలు చేయొద్దు అన్నా రు. నిజామాబాద్ అర్బన్ బిఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేస్ గుణవంతుడని అతన్ని మరోసారి గెలిపిస్తేనే నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి అవుతుందని బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ అన్నారు.

మంచి వ్యక్తిని గెలిపిస్తే అందరికి మంచి జరుగుతుందన్నారు. బిగాల గణేష్ గుప్తా గెలిచిన తరువాత మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్మంత్రి, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎంతో అభివృద్ధి చేశానని. నియోజకవర్గాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దానని తెలిపా రు. అలాగే జిల్లాలో నిరుద్యోగులకు ఐటిహబ్‌ను నిర్మించడంతో వారికి ఉద్యోగవకాశాలను లభిం చామన్నారు. నగరాభివృద్ధి భాగంగా వైకుంఠధామాలు, మినీ ట్యాంక్‌లు, ఆహ్లాదకరమైన పార్కు లు, సిసి రోడ్డులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి ప్రజలకు అందుబాటు ఉండేవిధంగా తీర్చిదిద్దామన్నారు.

రాయికి, రత్నానికి తేడా చూసి ఓటేయండి
ఎన్నికలో తెలంగాణ ప్రజలు రాయి రత్నం గుర్తిం చి ఓటు వేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. బోధన్‌లో జరిగిన ఆశీర్వా ద సభలో పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి రాలేదని ఆవేదన వ్య క్తం చేశారు. కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తారు ఓడిపోతారు కానీ ఎన్నికలు ఆయిపోయిన తర్వాత అసలు కథ మొ దలవుతుందన్నారు. మంచి అభ్యర్థులకు ఆలోచిం చి ఓటు వేయాలని అభ్యర్థులు పోటీ చేస్తున్న పార్టీ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పార్ట్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని వారి హక్కుల కోసం అని అన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఏం చేసిందో బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణను పాడు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీద ని గతంలో బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపి ప్రజలను 50 ఏళ్లు గోస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్‌ను గతంలో నమ్మి 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని తమను ఢోకా చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక బిఆర్‌ఎస్ పార్టీని చీల్చే కుట్రలు చేశారని పోరాటం తప్ప లేదన్నారు.

తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారని 15 ఏళ్లు తెలంగాణ బిడ్డలను ఏడిపించి రాష్టాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చిందని ఆంధ్రపాలనలో సింగూరు ప్రాజెక్టుతో నిజాంసాగర్ ఆయకట్టు రైతుల గొంతు కోశారని అన్నారు. సింగూరు నీళ్ల కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని తాను కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్నానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం బోధన్‌లో సుదీర్ఘకాలం పాటు దీక్షలు సాగాయని గుర్తు చేశారు. కాలేశ్వరం నీటితో నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏడాదంతా నీళ్లు ఉండేలా చేశామన్నా రు. కాంగ్రెస్ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి కనీ సం నిజాంసాగర్ కాలువలను పట్టించుకోలేదన్నారు. నయా పైసా తేలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మరి రైతులకు రైతు బం ధు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే రూ. 10వేల రైతుబంధుని రూ.16 వేలు చేస్తామన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 24 గంటల కరెంటు లేదని తెలంగాణలో మొండితనంతో తానే 24 గంటల కరెంటు ఇస్తున్నాని స్వతహాగా నేను రైతునని రైతుబాధలు తనకు తెలుసునన్నారు. బోధన్‌లో భారీ మెజారిటీతో షకీల్‌ని మూడో పర్యాయం గెలిపించాలని రైతులు మన వేలితో మన కన్నును పొడుచుకోవద్దని సూచించారు.

కాంగ్రెస్ అనాలోచిన నిర్ణయం వల్లే 58 ఏళ్లు గోస పడ్డాం
కాంగ్రెస్ పార్టీ అనాలోచిన నిర్ణయం వల్ల 58 ఏళ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటుంన్నారని,ధరణిని వద్దన్నా ఆ పార్టీని బంగాళాఖాతంలో ప్రజలే కలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ ఫైర్ అయ్యారు. ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభలోప్రజలను ఉద్దేశించి 33 నిమిషాల పాటు ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతు ధరణి రద్దు చేస్తే రైతుబంధు డబ్బులలో అవినీతి జరు గుతుందని వివరించారు. రైతుల క్షేమం కోసం ధరణి కచ్చితంగా ఉండాలని, లేకపోతే మళ్లీ తహశీల్ కార్యాలయంలో పైరవీలు ప్రారంభమవుతాయని అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందని చెప్పారు. మొదట హైదరాబాద్ స్టేట్‌గా ఉండే తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఆ పార్టీ అని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై 1969లో జరిగిన ఉద్యమం లో 400 మందిని కాల్చివేశారన్నారు. తాము టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించేదాకా వందలాది మందిని పొట్టన పె ట్టుకున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్య ర్థి ఎలాంటోడు ఆలోచించడం కాకుండా వారి వె నుక ఉన్న పార్టీల గురించి వాటి చరిత్ర గురించి ఆ లోచించాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు వెనుకబడ్డాయని అందుకోసమే తాను కా మారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎల్లారెడ్డిలో సురేందర్ గెలిచిన ఎల్లారెడ్డి ఎంఎల్‌ఎ తానేనని సిఎం ప్రకటించారు. ఎల్లారెడ్డి కామారెడ్డిని సమానంగా అభివృద్ధ్ది చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. సురేందర్ తనకు తమ్ముడు లాంటివాడని కుటుంబసభ్యుడిగా ఉద్యమ సమయంలో తన వెన్నంటే ఉన్నాడని కితాబిచ్చారు. తమ పార్టీ అభ్య ర్థి జాజాల సురేందర్‌ను గెలిపిస్తే ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సిఎం హామీ ఇచ్చా రు. పోచారం ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు తరలిస్తున్నామన్నారు. కరక్‌వాడి, గుజ్జుల్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో కాయత్తు లంబాడీలు బీసీల్లో ఉన్నారని వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ఈగ సం జీవరెడ్డి, రాజ్యసభసభ్యులు కెఆర్. సురేష్‌రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఎంఎల్‌ఎ షకీల్, ఎంఎల్‌సి రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మ న్ విట్టల్‌రావు, వైస్ చైర్మన్ రజిత యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి,మాజీ మంత్రి నేరేళ్ల ఆం జనేయులు, మాజీ ఎంఎల్‌ఎ జనార్దన్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభారాజు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, విజిగౌడ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాంకిషన్‌రావు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News