Thursday, May 9, 2024

మురిసిన పేద

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో గురువారం మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో నిర్మించిన.. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. దీంతో ఒకే ప్రాంగణంలో 15,660 ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ గృహ సముదాయానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సిఎం సందర్శించారు. బ్యాటరీ వెహికిల్‌లో వెళ్తూ.. గృహ సముదాయం పరిసరాలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులతో సిఎం స్వయంగా గృహ ప్రవేశం చేయించారు.

పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను ఇద్దరి చొప్పున అధికారులు ఎంపిక చేయగా.. వారితో కలిసి సిఎం గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, దివ్యాంగుడితోపాటు ఒకరు సాధారణ కేటగిరికి చెందిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News