Monday, April 29, 2024

డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే అన్ని రూపుమాపామమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పదేళ్లపాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలించి సర్వనాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆమనగల్లు పట్టణంలోని అయ్యప్పకొండ మైదానంలో ఆదివారం బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా నిర్వహించిన ప్రజా దీవెన బహిరంగ సభకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ సభ్యులు బంగారు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బోక్క నర్సింహ్మరెడ్డి, తదితరులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ప్రజలంతా కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపి అభ్యర్థి తల్లోజు ఆచారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రజలను కోరారు.

బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే, అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి, దర్శనభాగ్యం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. యూపీలో మాఫియాను బుల్డోజర్‌తో అణిచివేశామని, ఎంఐఎం, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే పార్టీలని అన్నారు. యూపిలో అరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలిచ్చామని తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు. బిజెపి అధికారంలో ఉంది. కాబట్టే రామ మందిర నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ప్రజా దివెన సభలో నాయకులు యెన్నం శేఖర్‌రెడ్డి, కండెహరిప్రసాద్, బండెల రాంచంద్రారెడ్డి, చిన్నం కృష్ణయ్య, నేనావత్ రాంపాల్‌నాయక్, దుర్గా ప్రసాద్, కాసుల వెంకటేష్, దండు శ్రీను, సభావట్ రాందాస్‌నాయక్, మట్ట వెంకటేష్, ఎమ్మార్పీస్ కృష్ణ, గోరేటి నర్సింహ్మ, భీమనపల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News