Saturday, April 27, 2024

రూపం మార్చుకోవడం… కాటేయడమూ తెలుసు

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’ ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలకానుంది. తాజాగా ‘కోబ్రా’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. “హి ఈజ్ ఏ కోబ్రా. రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్ళడం తెలుసు. చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు” అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్.. హైవోల్టేజ్ యాక్షన్, విక్రమ్ రకరకాల అవతారాలు, నట విశ్వరూపంతో మైండ్ బ్లోయింగ్ అనిపించింది.

తన జీవితంలోని ప్రతి ఒక్క సెకను అంకెలను పీల్చుకునే, ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొని, దేశ విదేశాలు తిరుగుతూ… గణితశాస్త్రాన్ని ఉపయోగించి నేరాలు పాల్పడిన మేధావి కోబ్రా పాత్రలో విక్రమ్ నటన అద్భుతంగా వుంది. ఈ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతుచిక్కని కోబ్రా కోసం వేటలో ఉన్న పోలీసుగా కనిపించారు. శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రేయసిగా కనిపించగా, రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు. ట్రైలర్‌కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ లెవెల్‌లో ఉంది. హరీష్ కన్నన్ కెమెరా పనితనం రిచ్‌గా వుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈనెల 31న విడుదలవుతుంది.

Cobra Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News