Sunday, April 28, 2024

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

తార్నాక : ప్రశాంతమైన జీవనానికి యోగా సాధన మార్గం చూపుతుందని ఓయు వీసి ప్రొ.రవీందర్ పేర్కోన్నారు.బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఓయు ఆర్ట్ కళాశాల ద్ద ఏర్పాటు చేసిన యోగా సాదన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఈ సంవత్సరం నుంచి యోగా కోర్సులను అందుబాటులోకి తీసుకోచ్చామని,అందులో సంపూర్ణ యోగా,ప్రాణాయామం తదితర కోర్సుల పాఠ్యప్రణాళిక రూపపొందించామని వివరించారు.అనంతరం రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవన శైలీ వ్యాదులకు దూరంగా ఉండెందుకు ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని అన్నారు.

ఏకాగ్రత కోసం విద్యార్థులు యోగాభ్యాసం చేయాలని,అద్యాపకులు,ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయాలని ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొ.మృణాళిని తెలిపారు. విద్యార్థ్దులు పెద్ద సంఖ్యలో హాజరైన యోగా సాధన కార్యక్రమానికి ఎన్.సి.సి.2 తెలంగాణ ఎయిర్ స్కాడ్రన్ కమాండింగ్ అధికారి గ్రూప్ కెప్టెన్ కె.ఎం.వేణుగోపాల్ అతిథిగా హజరై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్,ఎన్‌సిసి అధికారి డి.సుమన్,ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.సి.గణేష్,సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.వీరయ్య తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News