Monday, April 29, 2024

మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ నేతల చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిలో చీలిక తర్వాత మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మంగళవారం పార్టీ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఎన్‌సిపిలో చీలిక తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి తమకు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది కూడా. ఎన్‌సిపి చీలిక తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీపై దీని ప్రభావం ఏ విధంగా ఉండనుందనే విషయాలను కాంగ్రెస్ నేతలు పార్టీ నాయకత్వంతో చర్చించనున్నారు.

ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఎఐసిసి మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హెచ్‌కె పాటిల్, పిసిసి చీఫ్ నానా పటోలెతో పాటుగా రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News