Monday, April 29, 2024

కాంగ్రెస్ మార్క్ మార్పులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ

వాహనాల రిజిస్ట్రేషన్లలో టిఎస్ స్థానంలో ఇక నుంచి టిజి

తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నంలో మార్పులు, చేర్పులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమో దం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్రగేయంగా ఖరారు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చే యాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటితో పాటు వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్ర స్తుతం ఉన్న టిఎస్‌ను టిజిగా మార్చాలని, ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం తో పాటు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి, కులగణనకు సైతం మంత్రివర్గం ఆమో దం తెలిపింది. హైకోర్టుకు 100 ఎకరాల స్థలం ఇవ్వాలని, సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాబిక్ష పెట్టే విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు మంత్రివర్గం సూచించింది. రూ.500ల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్‌ల లోపు ఉచిత విద్యుత్ స్కీం పథకాల అమలతో పాటు కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుమారు మూడున్నర గంటలపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం మం త్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 14కోట్ల 25 లక్షల మహిళలు ఇప్పటివరకు ఆర్ టిసిలో ప్రయాణించారని ఆయన తెలిపారు. అ భయహస్తం ఆరుగ్యారంటీల అమల్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లోనే రెండు పథకాలను అమలు చేశామన్నారు. ఇందిరమ్మ రా జ్యం కావాలని కలలుకన్న ప్రజల నమ్మకాన్ని ఈ ప్రభుత్వం వమ్ము చేయదన్నారు. మరో రెం డు గ్యారంటీలను అమలును అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తెలంగాణను రూపొందించుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో రాజరిక పోకడలు తప్ప, ప్రజాస్వామ్యం కనిపించలేదని ఆయన ఆరోపించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజ లు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. దీనికోసం కళాకారుల నుంచి ప్రతిపాదన లు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. మాజీ సిఎం కెసిఆర్ పదేళ్లలో ఏమీ ఒరగబెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ ఆలోచనలకు అనుగుణంగా కులగణన
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 8వ తేదీ నుం చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఆయ న తెలిపారు. కొడంగ ల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన పేర్కొన్నా రు.65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించామన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ హై కోర్టుకు 100 ఎకరాల స్థలం ఇవ్వాలని, ఖైదీలకు క్షమాబిక్ష పెట్టే విషయంలో అధికారులు సత్వరం చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణ యం తీసుకుందన్నారు. కేంద్రం గెజిట్ మేరకు ఇక రాష్ట్రంలో జరిగే వాహనాలన్నింటికి టిజి నెంబర్ ప్లేట్‌తోనే రిజిస్ట్రేషన్ అవుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖలోని ఖాళీలను నింపాలని నిర్ణయించామని, ఉద్యోగాల భర్తీ అంశంపై కసరత్తు చేస్తున్నామని, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా వీటిపై కూడా కేబినెట్‌లో చర్చించామని ఆయన తెలిపారు. నిజాం షుగర్స్ మూసివేతపై సిఎం ఆధ్వర్యంలో సమీక్ష జరిగిందని పలు అంశాలపై చర్చించామన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కులగణన చేయాలని కేబినెట్‌లో నిర్ణయించామని ఆయన తెలిపారు. ఆరుగ్యారంటీల అమల్లో ఎలాంటి అనుమానాలు అక్కర లేదని, గత ప్రభుత్వం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసినా వెనక్కి తగ్గమని మాటిచ్చామన్నారు. అహంకారపూరితమైన చిహ్నాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News