Monday, April 29, 2024

ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ టైం.. బిఆర్‌ఎస్‌కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్యడైలాగ్ వార్  కొనసాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లో చేరతారని ఆయన ఇప్పటికే వెల్లడించారు.

ఆయన వ్యాఖ్యలను బట్టి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక జడ్పీటీసీ, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కూడా బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

రేపు ఖమ్మంలో జరగనున్న జన గర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా, రేపు సాయంత్రం ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు వస్తున్నందున ఖమ్మంలో కాంగ్రెస్ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో అలంకరించారు. 1221 కిలోమీటర్లు సాగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 107 రోజుల ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పీపుల్స్ మార్చ్ ముగింపు సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే వేదికపై రాహుల్ గాంధీ సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News