Monday, April 29, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 65,466 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న 26,174 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.27కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. సోమవారం రోజున స్వామివారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News