Friday, April 26, 2024

ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ విజృంభిస్తున్న కరోనా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. దీంతో బ్రిటన్, రష్యా, చైనా దేశాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరోసారి పంజా విసురుతుండడంతో రష్యాలో కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు, చైనాలో పాఠశాలలను మూసివేశారు. విమానాలను కూడా రద్దు చేశారు.లాటిన్ దేశమైన పెరూలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24.3కోట్లకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 49.4లక్షలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇండియాలో కరోనా అదుపులోనే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో ఇండియాలో 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Corona cases rising again World Wide

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News