Saturday, April 27, 2024

ఒక్కరోజే 63 కేసులు

- Advertisement -
- Advertisement -

Corona positives

 

దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు

n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n ఢిల్లీ, బెంగళూరు మెట్రోలు కూడా బంద్ n జనతా కర్ఫూకు పెరుగుతున్న మద్దతు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 165కు పైగా దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా భారత్‌పై కూడా క్రమంగా పడగవిప్పుతోంది. శుక్రవారం ఒక్కరోజే 63కి పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 236కు చేరుకుంది. దీంతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తమ చర్యలను మరింత వేగవంతం చేశాయి. వచ్చే ఆదివారం నాడు జనతా బంద్‌కు పిలుపునిచ్చిన న్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం నిర్వహించి ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతపై వారితో చర్చించారు. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరిగి పోతుండడంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి మరిన్ని చర్యలు తీసుకునేలా చేశాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయి, పుణె నగరాలతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కార్యాలయాలు, వాణిజ్య సంస్థలను ఈ నెల 31 వరకు మూసి వేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించగా, దేశ రాజధాని ఢిల్లీలో నిత్యావసర సరకుల దుకాణాలు, మందుల దుకాణాలు తప్ప అన్ని మాల్స్‌ను మూపి వేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.

దేశావ్యప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి పెరగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు అటు ఈ వైరస్‌ను అదుపు చేయడంతో పాటుగా వైరస్ కారణంగా భయపడుతున్న జనం నిత్యావసర సరకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చూడాల్సిన కొత్త సమస్య కూడా తోడైంది. చాలా దుకాణాల వద్ద జనం నిత్యావసర సరకులుకోసం బారులు తీయడం కనిపిస్తోంది. ఆదివారం తమ దుకాణాలను మూసివేసి జనతా కర్ఫూకు సహకరిస్తామని పలువురు వ్యాపారులు చెబుతుండగా, ఇళ్లకే పరిమితం కావడం ద్వారా ప్రధాని పిలుపును విజయవంతం చేస్తామని పలువురు చెబుతున్నారు. కాగా, జనతా కర్ఫూలో భాగంగా శనివారం అర్ధరాత్రినుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్లను నిలిపివేయనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు మెట్రో రైలు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించగా, మిగతా నగరాల్లోని మెట్రోలు కూడా అదే బాటలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా కరోనా వైరస్ సోకిన వారిలో 32 మంది విదేశీయులు కూడా ఉన్నారు. వీరిలో 17 మంది ఇటలీకి చెందిన వారు కాగా, ముగ్గురు ఫిలిప్పీన్స్‌నుంచి వచ్చిన వారు, ఇద్దరు బ్రిటీషర్లు, కెనడా, ఇండో నేసియా, సింగపూర్‌లకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. ‘ దేశవ్యాప్తంగా కోవిడ్ 2019 (కరోనా) పాజిటివ్ కేసుల సంఖ్య 196గా ఉండగా, నయమైన వారు/ డిశ్చార్జి అయిన వారు/ స్వస్థలాలకు వెళ్లిన వారు 23 మంది, మరణించిన వారు నలుగురు ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌నుంచి కోలుకున్న 69 ఏళ్ల ఇటలీ పర్యాటకుడు తీవ్రమైన గుండెపోటుతో జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు ఎస్‌ఎంఎస్ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ సుధీర్ భండారీ చెప్పారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఒక విదేశీయుడు సహా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, యుపిలో ఒక విదేశీయుడు సహా 23 కేసులు నమోదైనాయి.

మహారాష్ట్రలో మొత్తం 52 కేసులు వెలుగు చూడగా వీరిలో ముగ్గురు విదేశీయులున్నారు. అలాగే కేరళలో ఇద్దరు విదేశీయులు సహా 28 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా కర్నాటకలో 15,లడఖ్‌లో పది, జమ్మూ, కశ్మీర్‌లో నాలుగు, తెలంగాణలో 9 మంది విదేశీయులు సహా 17 మందికి ఈ వైరస్ సోకింది. రాజస్థాన్‌లో ఇద్దరు విదేశీయులు సహా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. భిల్వారా జిల్లాలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారంనుంచి జిల్లాలో కర్ఫూ విధించారు. హర్యానాలో 14 మంది విదేశీయులు సహా 17 మందికి కరోనా వైరస్ సోకగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఇద్దరేసి, ఉత్తరాఖండ్‌లో ముగ్గురికి ఈ వైరస్ సోకింది.

బాలీవుడ్ గాయని కలకలం
బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం బాలీవుడ్‌తో పాటుగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆమె పాల్గొన్న ఒక కార్యక్రమానికి హాజరైన పలువురు రాజకీయ నాయకులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన వారిలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, ఆమె కుమారుడు, ఎంపి దుష్యంత్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో పార్లమెంటుకు కూడా కరోనా సెగ పాకినట్లయింది. దుష్యంత్‌తో పార్లమెంటులో సన్నిహితంగా మెలిగిన టిఎంసి సభ్యులు డెరిక్ ఒ బ్రియాన్, అప్నాదళ్ ఎంపి అనుప్రియా పటేల్ కూడా స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు.

మధ్యప్రదేశ్‌లో నాలుగు కొత్త కేసులు
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు చెప్పారు.

 

Corona positives cases 236 in the country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News