Monday, April 29, 2024

ఆగస్టు 15 నాటికి వ్యాక్సీన్ విడుదల చేస్తాం: ఐసిఎంఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో దేశంలో ప్రతిరోజూ 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. ఇక, కరోనాతో మరణించినవారి సంఖ్య 18వేలకు చేరువైంది. దీంతో దేశంలోని పలు వైద్య కంపెనీలు కరోనాకు వ్యాక్సీన్ కొనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాక్సీన్‌పై ఐసిఎంఆర్ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సీన్ విడుదల చేస్తామని ఐసిఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక్సీన్ మానవప్రయోగ దశలో ఉందని ఐసిఎంఆర్ తెలిపింది.

Corona Vaccine Launch by August 15: ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News