Monday, April 29, 2024

ముమ్మరంగా కొనసాగుతున్న సెకండ్ డోసు

- Advertisement -
- Advertisement -

Corona vaccine second dose continue in Hyderabad

ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు కట్టిన స్దానికులు
మూడు జిల్లాల పరిధిలో 48లక్షల మంది టీకా కోసం ఎదురుచూపులు
నాలుగు రోజుల్లో 2లక్షలమందికి వ్యాక్సిన్ పంపిణీ
సెకండ్ డోసు గురించి ఆందోళన అవసరంలేదు
కోవిషీల్డ్ సరిపడ నిల్వలు ఉన్నాయంటున్న జిల్లా వైద్యాధికారులు

హైదరాబాద్: నగరంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. గత నాలుగు రోజులనుంచి కోవిషీల్డ్ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసి మొదటి డోసు తీసుకుని సెకండ్ డోసు కావాల్సిన వారికి వైద్య సిబ్బంది వేస్తున్నారు. పలు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద స్దానిక ప్రజలు బారులు కట్టి సకాలంలో టీకా వేసేందుకు ముందుకు వస్తున్నారు. వైద్యులు సూచించిన సమయానికి తీసుకోకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని భావిస్తూ వ్యాక్సిన్ వేసుకుంటున్నట్లు వైద్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. కోవాగ్జిన్ కావాల్సిన వారికి నిల్వలు లేవని, కోవిషీల్డ్ తీసుకునే వారు మొదట ఎక్కడ తీసుకోన్నారో అక్కడి వచ్చి సెకండ్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇకా మొదటి టీకా తీసుకోని వారుంటే వెంటనే సమీపంలోని హెల్త్ సెంటర్లకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు బస్తీ, కాలనీ ప్రజలను కోరుతున్నారు. నిర్లక్షం చేస్తే కరోనా సోకితే ఆరోగ్యం ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

సరూర్‌నగర్, మలక్‌పేట, ముషీరాబాద్, అంబర్‌పేట, తిరుమలగిరి, కూకట్‌పల్లి, శివరాంపల్లి, సరూర్‌నగర్, హయత్‌నగర్ కేంద్రాల్లో ఉదయం 8గంటలకే జనం క్యూ కడుతున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ జూన్ నెలాఖరువరకు వేగంగా సాగింది. జూలై నుంచి టీకా మందకొడిగా సాగుతుంది. ప్రస్తుతం వైద్యశాఖ ఉన్నతాధికారులు వ్యాక్సిన్ నిల్వలు తెప్పించడంతో మళ్లీ టీకా పంపిణీ కొనసాగిస్తున్నారు. జూలై రెండవ వారం వరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 59, 98,971 మంది మొదటి డోసు తీసుకోగా, సెకండ్ డోసు 9, 86, 057మంది తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ చేపటడంతో 2లక్షలమంది టీకా తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇంకా 48 లక్షల మంది రెండో డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లుతున్నారు. 15 రోజుల్లో సెకండ్ డోసు కావాల్సిన వారందరికి వేస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్దానిక వైద్యాధికారులు చెబుతున్నారు.

కోవాగ్జిన్ కోసం ఆరోగ్య కేంద్రాల చుట్టూ ః కొంతమంది మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకోవడంతో సెకండ్ డోసు కూడా అదే కావాలి, అందుకోసం నగరంలో టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యాదికారుల మాత్రం ప్రస్తుతం కోవిషీల్డ్ అందుబాటులో ఉందని, కోవాగ్జిన్ మాత్రం లేదని, కొన్ని రోజుల పాటు ఎదురుచూపులు తప్పవంటున్నారు. ఎంతమందికి అవసరమనే వివరాలు సేకరించి ఆగస్టు మొదటి వారంలో వచ్చేలా రాష్ట్ర వైద్యాదికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఆరోగ్య శాఖ పేర్కొంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News