Saturday, April 27, 2024

గ్రేటర్‌లో కరోనా కల్లోలం

- Advertisement -
- Advertisement -

Covid-19

హైదరాబాద్: గ్రేటర్ కరోనా మహమ్మారి పరుగులు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. రోజుకు సగటున 40 కేసులు నమోదైతూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. గత పది రోజుల నుంచి రాజధాని నగరంలో తప్ప చుట్టు పక్కల జిల్లాలో పాజిటివ్ కేసులు జీరోకు చేరుకుని గ్రీన్ జోన్‌ల్లోకి వెళ్లి లాక్‌డౌన్ నుంచి ఊపిరి పీల్చుకున్నాయి. హైదరాబాద్ నగరంలో మాత్రం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ రెడ్‌జోన్ పరిధి మరింత విస్తరిస్తుంది. మొన్నటివరకు పాతబస్తీలో విజృంభన చేసి వైరస్ పక్షం రో జులుగా శివారు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.

అధికారులు ఒక కరోనా కేసులు నమోదైతే ఆఇంటికి చుట్టపక్కల వంద మీటర్ల వర కు కంటైన్‌మెంట్ జోన్‌గా విభజించి అక్కడ నివసించే ప్రజలు హోం క్వారంటై న్ చేస్తూ 14 రోజుల పాటు పూర్తిగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అ యిన ఏదో ఒక లింకుతో వైరస్ చాపకింది నీరుల్లా విస్తరిస్తుంది. మాదన్నపేట, జియాగూడ, లంగర్‌హౌజ్, మలక్‌పేటగంజ్, వనస్దలిపురం, కర్మన్‌ఘాట్, నా గోల్ వంటి ప్రాంతాల్లో కేసులు నమోదైతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వస్తే సభ్యులందరికి సోకుతుందని, వారి ద్వార సమీప బంధువులకు చేరుతుందంటున్నారు. ఇటీవల కాలం లో జియాగూడలో ఒకే కుటుంబంలో 09మంది సోకింది.

మళ్లీ రెండు రోజుల తరువాత మాదన్నపేటలో ఒక అపార్టుమెంటులోని 30 కేసులు వరకు నమోదయ్యాయి. 15 రోజుల కితం వనస్దలిపురంలో ఒక వృద్దురాలుకు సోకగా ఆ మె నుంచి కుటుంబంలోని 11మంది ఆసుపత్రులో చేరారు. మలక్‌పేట గంజ్‌లోని ఇద్దరు చక్కెర వ్యాపారులకు పాజిటివ్ రాగా, వారి ద్వారా మరో ముగ్గు రు వ్యాపారులు, హామాలీలు, కుటుంబసభ్యులకు వైరస్ సోకింది. ఇప్పటివర కు గ్రేటర్ నగరంలో 960కిపైగా కేసులు నమోదుగా 31 మంది చనిపోయారు.

మూడు జిల్లాలలో 54 పోలీసుస్టేషన్ల పరిధిలో పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా విభజించి అధికారులు లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తు న్నా కరోనా మాత్రం నగర ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు వైరస్ నుంచి బయటపడి సాధారణ పరిస్దితులు వస్తాయోనని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు బ యటకు వెళ్లకుండా బౌతికదూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ వినియోగి స్తే మహమ్మారి వేగానికి ముక్కుతాడు వేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News