Wednesday, May 15, 2024

ఆ పిల్లలకు కరోనా సోకినా 30 శాతం మందిలో ఆ లక్షణాలు లేవు

- Advertisement -
- Advertisement -

Coronavirus is less prevalent in Children than in Adults

 

కెనడా లోని అల్బెర్టా ప్రావిన్స్ పిల్లలపై అధ్యయనం వెల్లడి

టొరంటో : గత మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కరోనా మొదటి దశ వ్యాప్తిలో కెనడా లోని అల్బెర్టా ప్రావిన్స్‌లో కరోనా వైరస్‌కు గురైన పిల్లల్లో మూడింట ఒక వంతు (30 శాతం ) కన్నా ఎక్కువ మందిలో అసింప్టమేటిక్ లక్షణాలు తప్ప కరోనా తీవ్ర లక్షణాలు ఏవీ లేవని అధ్యయనం వెల్లడించింది. కెనడా లోని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ నిర్వహించిన ఈ అధ్యయనం జర్నల్ సిఎంఎజెలో వెల్లడైంది. అల్బెర్టా ప్రావిన్స్ లోని మొత్తం 2463 మంది పిల్లల్లో 1987 మందికి కరోనా పాజిటివ్ 476 మందికి నెగిటివ్ కనిపించిందని, దాదాపు 36 శాతం మందికి అసింప్టమేటిక్ గా నమోదైందని అధ్యయనంలో వెల్లడైనట్టు యూనివర్శిటీకి చెందిన అధ్యయన నిర్వాహకులు ఫిన్లే మెక్‌అలిస్టర్ వెల్లడించారు. ఈ కారణంగా క్రిస్టమస్ వరకు స్కూళ్లను మూసివేయడం సరైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. పెద్దల కన్నా పిల్లల వల్ల వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ అసింప్టమెటిక్ లక్షణాలు సహజమే కాబట్టి వీటిని పాజిటివ్‌గా అనుకోనక్కరలేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News