Monday, April 29, 2024

దేశంలో చిన్నారుల కోసం కోవాగ్జిన్

- Advertisement -
- Advertisement -

Covaxin

న్యూఢిల్లీ: 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు అత్యవసరంగా వినియోగించే  తొలి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’కు కేంద్రం అనుమతిని ఇచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ మంగళవారం ఈ కోవాగ్జిన్ టీకాకు అనుమతినిచ్చింది. సెప్టెంబర్ నెలలో పిల్లలపై రెండు,మూడు దశల్లో ప్రయోగాలు చేసి, ఆ వివరాలను వ్యాక్సిన్ సంస్థ డిసిజిఐకి తెలియజేస్తూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన డిసిజిఐ ఆ సంస్థకు అనుమతినిచ్చింది. చిన్నారులకు ఉపయోగపడే కోవాగ్జిన్‌కు అనుమతి రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. 28 రోజుల వ్యవధితో రెండు డోసులుగా కోవాగ్జిన్ ఇచ్చే అవకాశం ఉంది. 18 ఏళ్లు పైబడిన వారికి 4 నుంచి 6 వారాల వవధితో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News