Wednesday, May 1, 2024

పండగ వేళ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
Covid precautions must take during Sankranti festival* పరిమిత సంఖ్యలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాలి
* ఇష్టానుసారంగా చేస్తే కరోనా కాటు తప్పదు
* చలితీవ్రతతో వేగంగా విస్తరిస్తుందంటున్న వైద్యులు
* హోంక్వారంటైన్ రోగులకు దూరంగా ఉండాలి

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి గత ఏడాది మార్చి నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇప్పటివరకు 2లక్షలకు పైగా వ్యాధికి కాటుకు గురికాక 1500లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పొయారు. పది నెల నుంచి ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ డిసెంబర్ నెల నుంచి వరుస పండగలు, చలితీవ్రత ఉండటంతో కేసులు సంఖ్య రోజుకు 35నుంచి 80వరకు బయటపడుతున్నాయి. తాజాగా సంక్రాంతి పండగ ఉండటంతో గ్రేటర్ వాసులకు పండగ వేళ అడంబరాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులతో పరిమితంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల యూకేలో స్ట్రెయిన్ రావడంతో ఆప్రభావం తమపై పడిందని, ప్రజలు ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా భౌతికదూరం పాటించి పండగను చేసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఈనెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ చేస్తున్నామని, రెండు రోజుల కితం నగరానికి చేరుకున్నాయని, కోల్డ్ స్టోరేజీలో భద్ర పరిచి వాటిని ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నట్లు, తరువాత పోలీసు, మున్సిపల్ సిబ్బంది, మూడో విడుత దీర్ఘకాలిక వ్యాధులు వారికి అందజేస్తామని, నాల్లో విడతలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని అప్పటివరకు ప్రజలకు ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని పేర్కొంటున్నారు. అదే విధంగా హోం క్వారంటైన్ రోగుల పట్ల జాగ్రత్తంగా ఉండాలని వారంతా ఇష్టానుసారంగా తిరుగుతూ ఇతరులకు సోకేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 42 వేలు మంది హోం క్వారంటైన్ చేయగా, ఇప్పటివరకు 39వేల మంది చికిత్స పొంది కోలుకున్నారు. మరో 3వేల మంది వైద్యం పొందుతున్నట్లు జిల్లా వైద్యాదికారులు వెల్లడిస్తున్నారు. మరోపక్క హోం క్వారంటైన్ ఉన్న రోగులు కొంతమంది దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం వంటి పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కొందరు అడ్రస్సు మార్చుతున్నారు. మరుసటి రోజు ఎఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తే సొంతూరు వెళ్లినట్లు సమీప ప్రజలు చెబుతున్నారు. గత వారం రోజుల నుంచి జనం రద్దీ పెరగడంతో పరీక్షల ఫలితాలు ఆరగంటలో ఇవ్వలేక రెండు రోజులకు తెలుపుతున్నారు. అయితే రక్తనమూనాలు ఇచ్చిన వ్యక్తులు వివరాలు, ఫోన్ తీసుకుని ఫలితాలు మెసెజ్ చేస్తామని చెప్పుతూ మరుసటి పోన్ చేస్తే ఆసుపత్రికి వస్తామని చెబుతూ తరువాత అందుబాటులో ఉండటంలేదని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వెల్లడిస్తున్నారు. పాజిటివ్ కేసులుగా తేలినవారు తమ వైరస్ సోకిన విషయం బయటపడుతుందని,చికిత్స చేయించుకోకుండా దర్జాగా తిరుగుతూ కరోనా విజృంభణకు కారకులైతున్నారని వైద్యులు చెబుతున్నారు. వారి గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. హోంక్వారంటైన్ రోగులపై ప్రత్యే నిఘా పెట్టడంతో పాటు, ర్యాపిడ్ టెస్టుల్లో పాజటివ్‌గా తేలినవారిని వెంటనే గుర్తించి ఆసుపత్రిలో చేరాలా ఉన్నతాధికారులు, స్దానిక ప్రజలు చూడాలని జిల్లా వైద్యాధికారులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News