Friday, May 17, 2024

మోడీ డైరెక్షన్లో మసకబారిన సుప్రీం ప్రతిష్ట..

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో మార్గం లేదు…
కేంద్రం దిగి రావలసిందే
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ

CPI Dr k Narayana criticises BJP

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు ఈ నెల 19కి వాయిదా పడిన నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ స్పందించారు. మోడీ పాలనలో సుప్రీంకోర్టుపై ఉన్న నమ్మకం కూడా నీరుగారిపోయిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై సుప్రీంకోర్టు వేసిన కమిటీని గుర్తించమని నిర్దందంగా రైతు సంఘాలు తిరస్కరించడంతో అత్యున్నత న్యాయస్థానానికి కూడా చదలు పట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

మోడీ డైరెక్షన్‌లో పనిచేయడం వలన అత్యున్నత న్యాయస్థానం కూడా అబాసుపాలైందని చెప్పారు. తమ సమస్యలు రాజకీయ అంశాలతో ముడిపడిన నేపథ్యంలో ప్రభుత్వంతోనే తేల్చుకుంటాం అని ప్రకటించిన తరుణంలో రైతులతో చర్చలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం కాకుండా నిలువరించడానికి అనేక పద్ధతుల్లో రైతు నేతల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే బిజెపి నేతలు తెలంగాణలో ముస్లింలపై ఆంధ్రాలో క్రిస్టియన్లపై మతపరమైన అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ రైతాంగ ఉద్యమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు, కుయూక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.

అనేక రాష్ట్రాల్లో మతాన్ని అడ్డం పెట్టుకుని రైతాంగ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన భయపడే వారు ఎవరు లేరని వ్యాఖ్యానించారు. రైతులు, రైతు సంఘాలు ఒకే తాటిపై గట్టిగా నిలబడ్డారని, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలని మూడు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News